సిట్ షాకింగ్ న్యూస్ : సేవామిత్ర యాప్‌లో తెలంగాణ డేటా

సేవా మిత్ర యాప్‌లో ఏపీ ప్రజల డేటా ఉందని..అనుకోవడం పొరపాటని..ఈ యాప్‌లో తెలంగాణ డేటా కూడా ఉందని..అసలు ఇది ఎందుకుంది ? ఇన్వేస్టిగేషన్ చేస్తున్నట్లు..డేటాతో వారు ఏం చేశారో తెలియాల్సి ఉందని ఐజీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ గ్రిడ్ డేటా చోరీ తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దీనిపై తెలంగాణ సర్కార్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు అయ్యింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఆయన మార్చి 07వ తేదీ గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన కేసుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీకి సంబంధించిన డేటా మాత్రమే ఉందని అనుకున్నారు. అయితే తెలంగాణకు సంబంధించిన డేటా ఉందని స్టీఫెన్ చెప్పడం పొలిటికల్‌గా మరింత హీట్ పుట్టించే ఛాన్స్ ఉంది.
Also Read : కారణం ఇదేనా?: టీడీపీ వెబ్ సైట్ కు ఏమైంది?
సిట్ ఏర్పాటయిన తరువాత తొలిసారి మీటింగ్ జరిపి కేసుకు సంబంధించిన విషయాలు అధ్యయనం చెసినట్లు చెప్పారు. 9 మంది అధికారులతో సిట్ ఏర్పాటైందని కేసుపై అన్ని వివరాలు సేకరించినట్లు తెలిపారు. అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు, విచారణకు సైబర్ నిపుణుల అవసరం ఉందని..నిష్పక్షపాతికంగా దర్యాప్తు జరుపుతామని..దర్యాప్తులో వాస్తవ విషయాలు తెలుస్తాయన్నారు. వీలైనంత త్వరగా ప్రజల ముందట వాస్తవాలు ఉంచుతామన్నారు. ఈ విషయంలో ప్రజలు భయపడవద్దని భరోసా ఇచ్చారు. సేవామిత్ర యాప్‌లో ప్రజల వ్యక్తిగత డేటా ఉందన్న ఆయన..డేటా వ్యవహారంలో లోతైన దర్యాప్తు జరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read : చెక్ చేసుకోండి : మహిళల ఖాతాల్లోకి రూ.3,500 వేసిన చంద్రబాబు
అసలు డేటా ఎక్కడి నుండి వచ్చిందో అశోక్ మాత్రమే చెప్పగలడని, ఇందులో ఎవరి పాత్ర ఉందో ఆయన్ను విచారించిన అనంతరం బయటపడుతుందన్నారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత త్వరలో విచారణ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేసులో ముద్దాయిలను వదిలిపెట్టమని..ఎంతటి వారైనా పట్టుకుని కోర్టు ఎదుట ప్రవేశ పెడుతామని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు.
Also Read : మీ ఓటు సేఫ్‌గా ఉండాలంటే : వెంటనే ఇలా చేయండి