తెలంగాణలో ఏపీ వార్తలు ఎందుకు రాయాలి? : కేటీఆర్  

ఏపీ సీఎం చంద్రబాబు పదవి నుంచి దిగిపోయే ముందు మన పథకాలను కాపీ కొడుతున్నారు’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

  • Published By: veegamteam ,Published On : January 23, 2019 / 11:34 AM IST
తెలంగాణలో ఏపీ వార్తలు ఎందుకు రాయాలి? : కేటీఆర్  

ఏపీ సీఎం చంద్రబాబు పదవి నుంచి దిగిపోయే ముందు మన పథకాలను కాపీ కొడుతున్నారు’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

హైదరాబాద్ : ’ఆంధ్ర ఎడిషనల్ లో తెలంగాణ వార్తలు రాయనప్పుడు…తెలంగాణలో ఏపీ వార్తలు ఎందుకు రాయాలి ’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. పత్రికల తెలంగాణ ఎడిషన్లలో ఏపీ వార్తలు ఉంటున్నాయని..ఏపీ ఎడిషన్లలో తెలంగాణ వార్తలు ఉండటం లేదని వాపోయారు. మీడియాలో ఆంధ్రా భావజాలం ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. ’ఏపీ సీఎం చంద్రబాబు పదవి నుంచి దిగిపోయే ముందు మన పథకాలను కాపీ కొడుతున్నారు’ అని విమర్శించారు. హైదరాబాద్ లో నిర్వహించిన జర్నలిస్టు, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ కు ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై, మాట్లాడారు.

 

ఉద్యమంలో జర్నలిస్టులు కీలకపాత్ర పోషించారని కొనియాడారు. జర్నలిస్టులకు పెద్దపీట వేసి గౌరవించిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. జర్నలిస్టులు, విద్యార్థి నాయకులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చామని తెలిపారు. కళాకారులకు పదవులు ఇచ్చాం…ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. జర్నలిస్టు సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు.