శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

  • Published By: madhu ,Published On : February 3, 2019 / 06:42 AM IST
శిఖా సోదరిలాంటిది : ‘కబాలి’ నిర్మాత స్పందన

Updated On : February 3, 2019 / 6:42 AM IST

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాంది హత్యేనని పోలీసులు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన దర్యాప్తులో పోలీసులు జయరాం ఫ్యామిలీలోని కొంతమంది మెంబర్స్‌ను ప్రశ్నించారు. వారిలో ప్రధానంగా జయరాం మేనకోడలు శిఖాను విచారించారు. అయితే ఈ కేసులో ‘కబాలి’ సినిమా తెలుగు నిర్మాత కేపీ చౌదరి పేరు వినిపించడం సంచలనం సృష్టించింది. శిఖాను కలవడానికి ఆ నిర్మాత వచ్చినట్లు వార్తలు గుప్పుమన్నాయి.

శిఖా కోసం ఇతను వచ్చారని…కారును తీసుకెళ్లాడని వార్తలు వెలవడ్డాయి. ఈ నేపథ్యంలో నిర్మాత కేపీ చౌదరి స్పందించారు. తనకు శిఖా సోదరిలాంటిదని…మీడియాకు తెలిపారు. శిఖా కుటుంబంతో తనకు నాలుగేళ్లుగా పరిచయం ఉన్నట్లు, హత్య చేసేంత క్రూర మనసత్వం శిఖాది కాదన్నారు. అంతేగాకుండా రాకేష్‌ను శిఖాతో ఎప్పుడూ చూడలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు చిగురుపాటి జయరాం అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మృతదేహానికి పలువురు నివాళులర్పించారు. అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగుతాయి.