వామ్మో : కిలో కనకాంబరం పూల ధర రూ.1400
ఓవైపు దసరా శరన్నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.

ఓవైపు దసరా శరన్నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.
ఓవైపు దసరా శరన్నవరాత్రులు, మరోవైపు బతుకమ్మ ఉత్సవాలు.. తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం కనిపిస్తోంది. అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆలయాలను రకరకాల పూలతో అందంగా అలంకరిస్తున్నారు. ఇక బతుకమ్మ అంటేనే పూల పండగ. పూలు లేకుండా పూజ జరగదు. దీంతో పూలకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. కనకాంబరం పూలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కనకాంబరం పూల ధరలు చుక్కలను అంటుతున్నాయి. మార్కెట్ లో కిలో కనకాంబరం పూల ధర రూ.1400గా ఉంది. దీంతో మహిళలు షాక్ అవుతున్నారు. కనకాంబరం పూలు కొనగలమా అని వర్రీ అవుతున్నారు.
శనివారం(అక్టోబర్ 5,2019) ఏపీలోని అనంతపురం జిల్లా బత్తలపల్లి మార్కెట్ లో కనకాంబరం పూలు కిలోకు రూ.1,400 చొప్పున ధర పలికాయి. వీటిని స్థానికంగా విక్రయించడంతో పాటు తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలలోని పూల మార్కెట్లకూ తరలిస్తామని వ్యాపారులు చెప్పారు. కనకాంబరం పూల ధరలతో కొనుగోలుదారులు షాక్ అవుతుంటే.. సాగు చేసిన రైతులు మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. కనకాంబరం పూలతో లాభాలు వస్తున్నాయని ఆనంద పడుతున్నారు.