లంచం లేని వ్యవస్థ : తెలంగాణలో కొత్త చట్టాలు

  • Published By: madhu ,Published On : April 13, 2019 / 03:26 AM IST
లంచం లేని వ్యవస్థ : తెలంగాణలో కొత్త చట్టాలు

Updated On : April 13, 2019 / 3:26 AM IST

లంచం లేని వ్యవస్థ..అవినీతికి ఆస్కారం లేని విధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశార. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు త్వరలోనే రానున్నాయి. రెవెన్యూ ఆఫీసులు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే విధంగా ఉండాలని..ఇందుకు ఎలాంటి మార్పులు చేయాలనే దానిపై సీఎం కేసీఆర్ మంత్రులు, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఏప్రిల్ 12వ తేదీ  శుక్రవారం ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరిగింది. 

రెవెన్యూలో, రిజిస్ట్రేషన్‌లో, పురపాలక సంఘాలు, గ్రామం పంచాయతీల్లో ఒక్క పైసా లంచం ఇవ్వకుండా పనులు జరిగే పరిస్థితులు రావాలని కేసీఆర్ అన్నారు. ఇందుకు కోసం ఏ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజల నుండి వేలాదిగా కంప్లయింట్స్ వస్తున్నట్లు, లంచాలు లేని వ్యవస్థను తీసుకరాలేమా అని ప్రశ్నించారు. పకడ్బందీగా..పటిష్టమైన చట్టాలు రూపొందించాలని ఆదేశించారు. కొత్త డివిజన్లు, కొత్త జిల్లాలు, కొత్త మండలాలు, కొత్త పురపాలక సంఘాలు ఏర్పాటు చేసినా అవినీతి వెళ్లడం లేదని కేసీఆర్ నిరుత్సాహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆయా కార్యాలయాల్లో అవినీతి లేకుండా ప్రజలకు పనులు జరగాలని సూచించారు.

జిల్లా పరిషత్‌లకు, మండల పరిషత్‌లకు కూడా తమ విధుల విషయంలో స్పష్టతనివ్వాలని, మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు, గ్రామ పంచాయతీలు పారిశుధ్యం, పచ్చదనం, మౌలిక సదుపాయాల కల్పనపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా స్థాయిలో IAS అధికారి నాయకత్వంలో అధికార యత్రాంగం ఉన్నట్లే.. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నాయకత్వంలో ముఖ్యమైన అధికారుల వ్యవస్థ ఏర్పాడాలని కేసీఆర్ అన్నారు. అదనపు సీఎస్‌లను నియమించి వారికి శాఖలు అప్పగించాలి..జిల్లా స్థాయిలో IAS అధికారి నాయకత్వంలో పనిచేసే బృందం పర్యవేక్షించి..ఎప్పటికప్పుడు నిర్ణయాలను ఈ బృందం తీసుకోవాలని అన్నారు కేసీఆర్.