యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం : కేటీఆర్

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్‌ఐపాస్ ద్వారా 13 లక్షల ఉద్యోగాల కల్పన జరిగిందని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్.ఐ.సీ.సీ. లో జరిగిన సీసీఐ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మౌలిక వసతుల కల్పనకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని చెప్పారు.
ఆర్థిక వృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని ఆయన అన్నారు. చిన్న ఆలోచనలతోనే కొత్త ఆవిష్కరణలు సాధ్యమవుతాయని కేటీఆర్ అన్నారు.
ప్రైవేటు రంగంలోనే ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయని.. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి వేగంగా జరుగుతోందని ఆయన వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సహకారం అందించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ చెప్పారు.