KTRను నడిపించే కొటేషన్ ఇదే

KTRను నడిపించే కొటేషన్ ఇదే

Updated On : December 29, 2019 / 12:04 PM IST

AskKTR పేరుతో తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నెటిజన్లతో అభిప్రాయాలు పంచుకున్నారు. 8వేలకు పైగా వచ్చిన ట్వీట్లలో ఆయన ఇచ్చిన కొద్ది ట్వీట్లకు మంచి స్పందన వచ్చింది. రాజకీయాల్లో మీకు ఇన్‌స్పిరేషన్ ఎవరని అడిగిన ప్రశ్నకు రెండో ఆలోచనే లేదు. అది కేసీఆరే.. అని బదులిచ్చారు. 

ప్రశాంత్ వంగప్ అనే వ్యక్తి.. మిమ్మల్ని నడిపించే మీ ఫేవరేట్ కొటేషన్ గురించి చెప్పండి అని అడిగితే.. ‘జీవితమంటే ఎంతగట్టి పంచ్ విసరగలం అని కాదు. ఎన్ని పంచ్‌లు తగిలినా ఎలా నిలబడగలిగామని’ (Life isn’t about how hard you can punch. It’s about how many punches you can take and still keep forging ahead) అని రెస్పాన్స్ ఇచ్చారు. 

 

కేటీఆర్ చేసిన కొటేషన్‌కు క్షణాల్లో వందల్లోలైక్ లు, పదుల్లో రీ ట్వీట్‌లు వస్తున్నాయి.