నేరం చేయకపోతే భయమెందుకు బాబు : కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు?

  • Published By: veegamteam ,Published On : March 5, 2019 / 06:15 AM IST
నేరం చేయకపోతే భయమెందుకు బాబు : కేటీఆర్ ట్వీట్

Updated On : March 5, 2019 / 6:15 AM IST

హైదరాబాద్: డేటా చోరీ కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు?

హైదరాబాద్: డేటా చోరీ వివాదం కేసులో ఏపీ టీడీపీ నేతలు చేసిన విమర్శలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏ నేరం చేయకపోతే ఈ ఉలికిపాటు ఎందుకు? తెలంగాణ పోలీసుల విధి నిర్వహణకు ఏపీ పోలీసుల అడ్డంకులు ఎందుకు? కోర్టులో తప్పుడు పిటిషన్లు ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. డేటా దొంగతనం బయటపడుతుందని సీఎం చంద్రబాబుకి భయం పట్టుకుందన్నారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన ప్రభుత్వం.. ఓ ప్రైవేట్ కంపెనీకి ఇవ్వడం ప్రైవసీ చట్టానికి తూట్లు పొడవడమే అన్నారు. ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అన్నట్టు.. చేయకూడని తప్పు చేసేసి.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంపై ఏడుపులు ఎందుకు? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు ట్విట్టర్‌లో కేటీఆర్ వరుస ట్వీట్ చేశారు.

ఐటీ గ్రిడ్‌ సంస్థ డేటా కుంభకోణం వ్యవహారం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పొలిటికల్ వార్‌గా మారింది. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్‌ సంస్థ తస్కరించి టీడీపీ ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిజానిజాలు రాబట్టే పనిలో ఉన్నారు. ఏపీకి చెందిన కంపెనీలో తెలంగాణ పోలీసులు ఎలా సోదాలు చేస్తారని టీడీపీ ప్రభుత్వం మండిపడింది. టీఆర్ఎస్ ప్రభుత్వం సహకారంతో టీడీపీ కార్యకర్తల సమాచారాన్ని చోరీ చేసేందుకు వైసీపీ కుట్ర చేసిందని చంద్రబాబు ఆరోపించారు. ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.