హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ : సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలివ్వాలి

  • Published By: veegamteam ,Published On : April 30, 2019 / 11:23 AM IST
హైకోర్టులో కాంగ్రెస్ పిటిషన్ : సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలివ్వాలి

Updated On : April 30, 2019 / 11:23 AM IST

హైదరాబాద్ : టీఆర్ఎస్ లో సీఎల్పీ విలీనం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం (ఏప్రిల్ 30, 2019)న హైకోర్టులో విచారణ జరిగింది. అత్యవసరంగా విచారణ అవసరం లేదని కోర్టు తెలిపింది. టీఆర్ఎస్ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు ఉంటాయని కోర్టు తెలిపింది. జూన్ 11కు విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. 

విచారణ సందర్భంగా ఈ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది జంద్యాల రవిశంకర్‌ కోర్టును కోరారు. అయితే దీనిపై అత్యవసర విచారణ అవసరం లేదని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కాగా కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్‌లో విలీనం చేసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.