తెలంగాణలో తేలికపాటి వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 10 శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

తెలంగాణలో తేలికపాటి వర్షాలు

Updated On : May 13, 2024 / 2:05 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 10 శనివారం తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మార్చి 10 శనివారం అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతం నుంచి కోమోరిన్ ప్రాంతం వరకు దక్షిణ కోస్తా, ఒడిషా, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, ఇంటీరియర్ తమిళనాడు మీదుగా ఉపరితల ద్రోణి బలహీనంగా మారడంతో పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని వెల్లడించింది. 

భద్రాచలంలో 37.2, నిజామాబాద్ లో 36.9, నల్గొండ, ఖమ్మంలో 36.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. హన్మకొండలో 36, మెదక్, రామగుండంలో 35.8, ఆదిలాబాద్ లో 35, హైదరాబాద్ లో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.