ఎంత చెత్త వేస్తే అంత ఆనందం : జీహెచ్ఎంసీకి రూ.కోటి ఆదాయం

అవును.. రోడ్డుపై ఎంత చెత్త వేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు అంత ఆనందం. మీరు ఎంత చెత్తా చెదారం వేస్తే వారు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే.. రోడ్డుపై నిర్లక్ష్యంగా

  • Published By: veegamteam ,Published On : September 17, 2019 / 04:38 AM IST
ఎంత చెత్త వేస్తే అంత ఆనందం : జీహెచ్ఎంసీకి రూ.కోటి ఆదాయం

Updated On : September 17, 2019 / 4:38 AM IST

అవును.. రోడ్డుపై ఎంత చెత్త వేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు అంత ఆనందం. మీరు ఎంత చెత్తా చెదారం వేస్తే వారు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే.. రోడ్డుపై నిర్లక్ష్యంగా

అవును.. రోడ్డుపై ఎంత చెత్త వేస్తే జీహెచ్ఎంసీ అధికారులకు అంత ఆనందం. మీరు ఎంత చెత్తా చెదారం వేస్తే వారు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే.. రోడ్డుపై నిర్లక్ష్యంగా చెత్తా, చెదారం వేసినందుకు అధికారులు ఫైన్ వేస్తారు. ఇలా జరిమానాల రూపంలో జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం వస్తోంది. వివరాల్లోకి వెళితే.. రోడ్డుపై, డ్రైనేజీల్లో చెత్తా చెదారం వేసిన వారికి విధించిన జరిమానాల రూపంలో జీహెచ్ఎంసీకి భారీగా రెవెన్యూ వచ్చింది. జస్ట్ 4 నెలల వ్యవధిలో కోటి రూపాయల రెవెన్యూ వచ్చింది.

హైదరాబాద్ నగరంలో రోడ్డుపైన, పబ్లిస్ ప్లేసుల్లో చెత్త, చెదారం వేయడం నేరం. అలాగే భవన శిథిలాలను ఎక్కడపడితే అక్కడ వేయకూడదు. దీనికి రూ.2వేలు జరిమానా విధిస్తారు. మే 24 నుంచి పెనాల్టీలు వేయడం స్టార్ట్ చేశారు అధికారులు. ఇందుకోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఆ బృందాలు నగరం అంతా తిరుగుతాయి. ఎవరైనా ఎక్కడైనా రోడ్డు పై చెత్త వేస్తూ కనిపిస్తే వారికి జరిమానా విధిస్తారు. ఇప్పటివరకు 8వేల 500మంది వ్యక్తులకు, సంస్థలకు జీహెచ్ఎంసీ అధికారులు ఫైన్ వేశారు. అలా కోటి రూపాయలు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.

* ఎక్కువ పెనాల్టీలు చందానగర్ సర్కిల్ నుంచి వచ్చాయి. 518 మంది కేసులు నమోదయ్యాయి. రూ.16.5 లక్షలు వచ్చాయి.
* ఖైరతాబాద్ సర్కిల్ లో 627 కేసులు నమోదయ్యాయి. రూ.8.41 లక్షలు వచ్చాయి.
* శేరిలింగంపల్లి సర్కిల్ లో 312 కేసులు, రూ.13.9 లక్షలు వచ్చాయి. 
* రామచంద్రాపురం, పటాన్ చెరు ప్రాంతాల్లో 45 కేసులు నమోదయ్యాయి. రూ.60వేల 400 వచ్చాయి.
* జూబ్లిహిల్స్ సర్కిల్ లో 426 కేసులు, రూ.6.86 లక్షలు వచ్చాయి. 
* మూసాపేటలో 350 కేసులు, రూ.5.15 లక్షలు
* ఉప్పల్ లో 417 కేసులు, రూ.4.54 లక్షలు వసూలు
* ముషీరాబాద్ లో 402 కేసులు నమోదు, రూ.4.32 లక్షలు వసూలు
* బేగంపేటలో 323 కేసులు, రూ.3.08 లక్షలు వసూలు

హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాంగా ”సాఫ్ హైదరాబాద్-షాన్ దార్ హైదరాబాద్” నినాదం ఇచ్చారు. పబ్లిక్ ప్లేసుల్లో చెత్తా చెదారం వస్తే తాట తీస్తారు. అంతేకాదు భవన శిథిలాలను రోడ్లపై వేసినా డ్రైనేజీలో వేసినా చర్యలు తప్పవు. దీనికి రూ.100 నుంచి రూ.10వేల వరకు జరిమానాలు వేస్తారు. మొత్తంగా రోడ్డుపై చెత్త, చెదారం వేసి అపరిశుభ్ర పనులకు పాల్పడితే అధికారులు జరిమానాల మోత మోగిస్తున్నారు అధికారులు. ఇలా జరిమానాలు వేస్తే అయినా జనాల్లో మార్పు వస్తుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటారని అధికారులు ఆశిస్తున్నారు.