ఆస్పత్రి నుంచి మధులిక డిశ్చార్జ్

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 10:34 AM IST
ఆస్పత్రి నుంచి మధులిక డిశ్చార్జ్

Updated On : February 20, 2019 / 10:34 AM IST

హైదరాబాద్ : ప్రేమోన్మాది భరత్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో పోరాడిన మధులిక కోలుకుంది. మలక్‌పేటలోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి.. ఆరోగ్యం మెరుగు పడటంతో డాక్టర్స్ 2019, ఫిబ్రవరి 20వ తేదీ బుధవారం డిశార్జ్ చేశారు. మెదడుకు గాయాలు కావడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తూ పలు సర్జరీలు చేశారు. క్రమంగా ఆమెకు ఆరోగ్యం సాధారణ స్థితికి చేరుకోవడంతో ఇంటికి పంపించారు. 
 

ఫిబ్రవరి 6న హైదరాబాద్ సిటీ బర్కత్‌పుర దగ్గర ప్రేమోన్మాది భరత్ కొబ్బరి బోండాలు నరికే కత్తితో మధులికపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. 15 చోట్ల కత్తి గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మలక్‌పేటలోని యశోద ఆసుపత్రికి తరలించారు. తీవ్ర రక్తస్రావం కావడంతో 74 గంటలు అపస్మారక స్థితిలోనే ఉండిపోయింది మధులిక. తలకు తీవ్రంగా కత్తిగాట్లు తగలడంతో ఆరోగ్యం క్లిష్టంగా మారింది. రక్తం ఎక్కించిన తర్వాత రక్తపోటు నియంత్రణలోకి రావడంతో వైద్యులు.. తలతో పాటు ఇతర గాయాల దగ్గర పలు సర్జరీలు చేశారు. నిరంతర పర్యవేక్షణతో మధులిక క్రమంగా కోలుకుంది. మధులికపై దాడికి పాల్పడిన భరత్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఊచలు లెక్కిస్తున్నాడు.