లంచం ఇవ్వకుండా ఇల్లు ఎలా కడతావో చూస్తా: వ్యక్తిపై మహిళా అధికారి చెప్పుతో దాడి

హైదరాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఓ మహిళా అధికారిణి ఓ ఇంటి యజమానిపై చెప్పుతో దాడికి దిగింది.ధశరథ రామిరెడ్డి అనే వ్యక్తిని చెప్పుతో కొట్టింది. ఇల్లు కట్టుకోవాలని పర్మిషన్ కావాలని గత మూడు సంవత్సరాలుగా రశరథరామిరెడ్డి తిరుగుతున్నాననీ పర్మిషన్ ఇవ్వాలంటే లంచం ఇవ్వాలని అడిగారనీ కానీ తాను లంచం ఇవ్వలేదనీ అందుకే తనపై దాడికి పాల్పడ్డారని వాపోతున్నాడు.
మేము అడిగిన డబ్బులు ఇవ్వకుండా ఇల్లు ఎలా కడతావో మేమూ చూస్తాం అంటూ బెదిరిస్తున్నారనీ బాధితుడు దశరథరామిరెడ్డి వాపోతున్నాడు. కానీ అధికారుల బెదిరింపులకు లొంగని దశరథరామిరెడ్డి కోర్టుకు వెళ్లి ఇంటి నిర్మాణానికి న్యాయస్థానం నుంచే పర్మిషన్ తెచ్చుకున్నానని..దీంతో తట్టుకోలేక తనపై సదరు మహిళా అధికారిణి చెప్పుతో దాడికి దిగారానీ ఆరోపించాడు. తనపై జరిగిన దాడి గురించి పోలీసులకు చెప్పినా వారు పట్టించుకోలేదని దశరథరామిరెడ్డి వాపోయాడు.
తాను కోర్టుకు వెళ్లానని సదరు అధికారులు తనను తరచూ వేధిస్తున్నారనీ..బెదిరిస్తున్నారనీ..ఈ విషయంపై ఏసీపీకి, సీబీఐకి కూడా ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని..ఈ క్రమంలో తాను బతకాలో..చావాలో కూడా అర్థం కాని దుస్థితిలో ఉన్నానని దశరథరామిరెడ్డి తెలిపాడు. తాను ఫిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు తనపై ఎదురు కంప్లైంట్ ఇచ్చిన మహిళా అధికారి తరపునే పోలీసులు మాట్లాడుతున్నారనీ ఒక రోజంతా తనను పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి వేధిస్తున్నారనీ..దయచేసి నా బాధను అర్థం చేసుకోవాలని వాపోతున్నాడు. నన్ను వేధిస్తూ..నామీద ఎదురు కంప్లైంట్ ఇచ్చి నన్ను ఎంతగానో వేధిస్తున్నారనీ దశరామిరెడ్డి విజ్నప్తి చేశాడు.