రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 03:47 AM IST
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Updated On : November 24, 2019 / 3:47 AM IST

సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రైలులో నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్ రైల్వే ప్లాట్ ఫాం-4లో ఉదయం గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు రైలులో నుంచి జారి పడి అక్కడికక్కడే మృతి చెందాడు. 

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.