మౌనిక మృతి మరువక ముందే : మెట్రో రైల్లో మరో ప్రమాదం
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి పడి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే.. మెట్రో రైల్లో మరో ప్రమాదం జరిగింది. ఈసారి బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్)

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి పడి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే.. మెట్రో రైల్లో మరో ప్రమాదం జరిగింది. ఈసారి బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్)
హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో పెచ్చులు ఊడి పడి మౌనిక మృతి చెందిన ఘటన మరవకముందే.. మెట్రో రైల్లో మరో ప్రమాదం జరిగింది. ఈసారి బోగీ లోపలి భాగంలోని పైకప్పు(సీలింగ్) ఊడిపడింది. దీంతో ప్రయాణికులు భయందోళనకు గురయ్యారు. అత్యంత రద్దీగా ఉన్న మెట్రో రైల్లో సీలింగ్ ఊడిపడిన సంఘటన శుక్రవారం(అక్టోబర్ 18,2019) సాయంత్రం ఖైరతాబాద్‌లో చోటు చేసుకుంది. ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వెళుతున్న మెట్రో రైలులో ప్రయాణికులు కిక్కిరిసి ఉన్నారు.
దీంతో కొందరు సపోర్ట్ కోసం పైకప్పుకి ఉన్న హ్యాండిల్‌ను పట్టుకొని నిలుచున్నారు. పరిమితికి మించి జనం దాన్ని పట్టుకోవడంతో కొంత భాగం ఊడిపడింది. ఈ ఘటనతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో రైలును కాసేపు నిలిపివేశారు. మరమ్మత్తులు చేశాక రాకపోకలను పునరుద్ధరించారు. బోగీ లోపలి భాగాలు అత్యంత తేలికైన ఫైబర్‌తో తయారు చేసినవి కావడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదు. సీలింగ్ ఊడిపడటంతో ప్రయాణికులు కంగారుపడ్డారు. ఏం జరిగిందోనని టెన్షన్ కి గురయ్యారు. మెట్రోలో జరుగుతున్న ఘటనలు ప్రయాణికులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. సేఫ్టీ గురించి వర్రీ అవుతున్నారు.
పెద్ద శబ్దంతో సీలింగ్ ఊడి పడిటంతో ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లో ప్రమాదం జరిగింది. మెట్రో పిల్లర్ పెచ్చులు ఊడి మౌనిక అనే యువతిపై పడ్డాయి. నేరుగా తల మీద పడడంతో తీవ్ర గాయాలై ఆమె చనిపోయింది. ఈ ఘటనతోమెట్రో పిల్లర్ల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఎల్ అండ్ టీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు డోర్ క్యాబిన్ ఊడిపడడంతో ప్రయాణికులు భయాందోళన చెందారు. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులు ఎక్కువగా మెట్రో రైలుని ఆశ్రయిస్తున్నారు. దీంతో మెట్రో స్టేషన్లలో రద్దీ ఎక్కువగా ఉంటోంది.