Metro Rail : సాయంత్రం 5 దాకా మెట్రో రైలు

తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ సమయాల్లో సడలింపులు ఇవ్వటంతో మెట్రో రైలు సర్వీసుల వేళల్లో అధికారులు మార్పులు చేశారు.

Metro Rail : సాయంత్రం 5 దాకా మెట్రో రైలు

Metro Rail Timings Extended Till 5 Pm From Tomorrow

Updated On : June 9, 2021 / 3:17 PM IST

Metro Rail : తెలంగాణలో రేపటి నుంచి లాక్‌డౌన్ సమయాల్లో సడలింపులు ఇవ్వటంతో మెట్రో రైలు సర్వీసుల వేళల్లో అధికారులు మార్పులు చేశారు. ఉదయం 7 గంటలకు మొదటి మెట్రో సర్వీస్‌ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు చివరి మెట్రో సర్వీస్‌ బయలుదేరుతుంది. సాయంత్రం 6 గంటలకల్లా మెట్రో రైళ్లు డిపోలకు చేరుకుంటాయి.

ఈనెల 10 నుంచి ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5వరకు లాక్ డౌన్ కు సడలింపులు ఇవ్వటంతో అధికారులు రైలు వేళల్లో మార్పులు చేశారు. నేటితో ముగుస్తున్న లాక్‌డౌన్ గడువు మరో 10 రోజుల పాటు పొడిగించిన ప్రభుత్వం…సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెంచింది. ప్రజలు ఇళ్లు, గమ్యస్ధానాలకు చేరుకునేందుక మరో గంట సమయం అదనంగా ఇచ్చింది.