కరోనా కొత్తేమీ కాదు, ప్రాణహాని లేదు
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సార్స్ కు మరో రూపమే కరోనా అని చెప్పారు. కరోనా వస్తే చావే అనే

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సార్స్ కు మరో రూపమే కరోనా అని చెప్పారు. కరోనా వస్తే చావే అనే
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి కొత్తేమీ కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సార్స్ కు మరో రూపమే కరోనా అని చెప్పారు. కరోనా వస్తే చావే అనే అభిప్రాయం కరెక్ట్ కాదన్నారాయన. సార్స్ కు వాడిన మందులే కరోనాకు వాడుతున్నామని వివరించారు. 90శాతం వరకు కరోనా వైరస్ తో ప్రాణహాని లేదని మంత్రి వెల్లడించారు. 5శాతం కేసులే క్రిటికల్ అని, ఐసీయూలో వైద్యం చేయించాల్సిన పరిస్థితి ఉందన్నారు.
తెలంగాణ గడ్డమీద ఉన్నవాళ్లకు కరోనా సోకలేదు:
ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే కరోనా సోకిందని మంత్రి చెప్పారు. తెలంగాణ గడ్డమీద ఉన్నవాళ్లకు కరోనా లేదన్నారు. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి ఈటల చెప్పారు. సినిమా థియేటర్లు మూసివేసినంత మాత్రాన ఏదో జరిగిపోతుందని భయపడాల్సిన పని లేదన్నారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత ఎమ్మెల్యేలందరూ నియోజకవర్గాలకు వెళ్లాలని, ప్రజలకు కరోనా వైరస్ గురించి అవగాహన కల్పించడంతో పాటు ధైర్యం చెప్పాలని మంత్రి ఈటల సూచించారు.
See Also | స్పెయిన్ లో కట్టలు తెంచుకున్న కరోనా….24గంటల్లో 2వేల మందికి సోకిన వైరస్