విమానం నడిపిన కేటీఆర్..గాల్లో చక్కర్లు

  • Published By: veegamteam ,Published On : March 13, 2020 / 04:28 AM IST
విమానం నడిపిన కేటీఆర్..గాల్లో చక్కర్లు

Updated On : March 13, 2020 / 4:28 AM IST

తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పైలట్‌ అవతారం ఎత్తారు. పైలెట్‌గా మారిన కేటీఆర్ శంషాబాద్‌లో విమానం నడిపారు. కొత్త అనుభూతిని పొందారు. విమానంలో మెయిన్  పైలట్ సూచనలతో విమానం నడిపి.. గాల్లో కాసేపు చక్కర్లుకొట్టారు. గురువారం (మార్చి 12,2020)శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్ (FSTC)ని ప్రారంభించిన అనంతరం కేటీఆ  కాసేపు విమానాన్ని నడిపారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

FSTC అనేది దేశంలో DGCA చేత గుర్తింపు పొందిన ప్రధాన విమానయాన టైనింగ్ సంస్థ  అంతర్జాతీయ ప్రమాణాలతో పైలట్లకు ట్రైనింగ్ ఇస్తుంది. దేశంలో ఇప్పటి వరకు గురుగ్రామ్‌‌లో మాత్రమే ఇటువంటిది ఉండేది. తాజాగా హైదరాబాద్‌లోనూ FSTC శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  

ఈ సంస్థ ప్రారంభ కార్యక్రమంలో మాట్లాడిన కేటీఆర్.. FSTC తన శిక్షణా సంస్థను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.  FSTC రాకతో శంషాబాద్ పరిసర వాసులకు శిక్షణా సౌకర్యాలతో పాటు..డెవలప్ మెంట్, యువతకు అవకాశాలు పెరుగుతాయని కేటీఆర్ ఆశాభావం వ్యక్తంచేశారు. 

See Also | నమస్తే అంటున్న ట్రంప్: ప్రపంచం అంతా భారతీయ సంప్రదాయం