నన్ను, నా సంగీతాన్ని విమర్శించి డబ్బు సంపాదిస్తున్నారు : కాపీ క్యాట్ ఆరోపణలపై తమన్

టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరి పేరు చెప్పాల్సి వస్తే.. అందులో కచ్చితంగా తమన్ పేరు ఉంటుంది. దాదాపు చాలా సినిమాలకు

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 02:51 PM IST
నన్ను, నా సంగీతాన్ని విమర్శించి డబ్బు సంపాదిస్తున్నారు : కాపీ క్యాట్ ఆరోపణలపై తమన్

Updated On : November 24, 2019 / 2:51 PM IST

టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరి పేరు చెప్పాల్సి వస్తే.. అందులో కచ్చితంగా తమన్ పేరు ఉంటుంది. దాదాపు చాలా సినిమాలకు

టాలీవుడ్ లో లీడ్ లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరి పేరు చెప్పాల్సి వస్తే.. అందులో కచ్చితంగా తమన్ పేరు ఉంటుంది. దాదాపు చాలా సినిమాలకు ఆయన సంగీతం ఇచ్చారు, ఇస్తున్నారు. తమన్ మ్యూజిక్ డైరెక్షన్ లో వచ్చిన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. వ్యూస్, లైక్స్ విషయంలో రికార్డులు క్రియేట్ చేశాయి. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ”అల..వైకుంఠపురము” సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తమనే.

ఇందులో ఇప్పటికే వచ్చిన సామజవరగమన ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో తెలిసిందే. మ్యూజికల్ గా పెద్ద హిట్ అయ్యింది. రాములో రాములా పాటకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. అల వైకుంఠపురం సినిమా పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

అయితే తమన్ అనేక విమర్శలకు గురయ్యారు. కాపీ కొట్టారనే ఆపవాదు ఉంది. దీని గురించి 10టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో తమన్ తన స్పందన తెలిపారు.

తాను విమర్శలను అస్సలు పట్టించుకోను అని తమన్ చెప్పారు. తనను విమర్శించడం ద్వారా డబ్బు సంపాదిస్తున్నారని తనకు తెలిసిందన్నారు. వారి సంపాదనను దెబ్బకొట్టడం ఇష్టం లేకనే తాను విమర్శలను పట్టించుకోవడం లేదన్నారు. నా డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో నన్ను నమ్ముతున్నారు.. అలాంటప్పుడు ఇతరుల విమర్శలను నేను ఎందుకు పట్టించుకోవాలి అని తమన్ అన్నారు.