సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం

సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 02:46 AM IST
సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవం

Updated On : November 24, 2019 / 2:46 AM IST

సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా హోంగార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశారు. హోంగార్డుల నియామకాలకు సంబంధించి ఏదైనా షెడ్యూల్ ఉంటే ముందుగా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటిస్తామని, పోలీస్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరుస్తామని డీజీపీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు వార్తలు నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దని సూచించారు.

హోం గార్డుల నియామకాలు జరుగుతున్నాయంటూ ఎవరో తప్పు డు వార్తలు ప్రచారం చేస్తున్నారని, ఆ వార్త ఫేక్ అని తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. దాన్ని కోట్ చేస్తూ డీజీపీ కూడా ట్వీట్ చేశారు. ఎవరైనా తాము ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు అడిగితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.