సోమవారం నుంచే క్లాసులు : దసరా సెలవులు పొడిగింపు లేదు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు

  • Published By: veegamteam ,Published On : October 13, 2019 / 03:02 PM IST
సోమవారం నుంచే క్లాసులు : దసరా సెలవులు పొడిగింపు లేదు

Updated On : October 13, 2019 / 3:02 PM IST

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు

తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో విద్యా సంస్థలకు(స్కూళ్లు, కాలేజీలు) దసరా సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 19వ తేదీ వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గురుకుల పాఠశాలలు, కళాశాలలకు దసరా సెలవుల పొడిగింపు వర్తించదని గురుకుల విద్యాలయాల కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులు ఇప్పటికే హాస్టల్స్ కి చేరుకున్నారని.. వారిని తిరిగి ఇళ్లకు పంపడం తల్లిదండ్రులకు అనవసరమైన భారం అని చెప్పారు. దీంతో గురుకులాల్లో సోమవారం(అక్టోబర్ 14,2019) నుంచే తరగతులు స్టార్ట్ అవుతాయని వెల్లడించారు. క్లాసులకు హాజరుకాలేని విద్యార్థులపై చర్యలు ఉండవని స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెతో గురుకులాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన అన్నారు.

ముందు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం దసరా సెలవులు అక్టోబర్ 13వ తేదీతో ముగియాల్సి ఉంది. అక్టోబర్ 14వ తేదీ నుంచి స్కూళ్లు, కాలేజీలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు సకాలంలో అందుబాటులో లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరగకపోడంతో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా విద్యాసంస్థలకు దసరా సెలవులు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈసారి ఎప్పుడూ లేని విధంగా విద్యాసంస్థలకు 16 రోజులు సెలవులు వచ్చాయి. ఓ పక్క ఆర్టీసీ కార్మికులు సమ్మె, మరోపక్క పండుగకు హైదరాబాద్‌కు తిరుగు పయనమయ్యే వారికి బస్సుల కొరత ఉండటంతో ప్రభుత్వం సెలవులను పొడిగించింది. అక్టోబర్ 5 నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు.