పీసీసీ చీఫ్ ఇవ్వాలంటున్న కోమటిరెడ్డి
పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు.

పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు.
పీసీసీ అధ్యక్షుడిగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్టానాన్ని కోరారు. తాను కూడా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతనేనన్న కోమటిరెడ్డి.. పార్టీ కోసం కష్టపడి పని చేశానన్నారు. అధిష్టానం తన అప్పీలును పరిశీలించాలని కోరారు. అంతిమంగా హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.
మంగళవారం (నవంబర్ 5, 2019) హైదరాబాద్ లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి. జాతీయ పార్టీ పిలుపు మేరకు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించారు. 15 రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. అందులో భాగంగానే గులాంనబీ ఆజాద్ హైదరాబాద్ లో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.
అయితే ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడి మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతున్నక్రమంలో తనకు అవకాశం ఇవ్వాలని భువనగిరి ఎంపీ, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ..గులాంనబీ ఆజాద్ కు విజ్ఞప్తి చేశారు. అదే విషయాన్ని మీడియాకు కూడా చెప్పారు కోమటిరెడ్డి. పార్టీలో చాలా కాలం నుంచి పని చేస్తున్నాను, లాయల్ గా ఉండే వ్యక్తినని, తనకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే రానున్న రోజుల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. ఇప్పటికే పీసీపీ చీఫ్ మార్పు జరుగుతుందని ప్రచారంలో ఉన్నప్పటి నుంచి మాజీ పీసీపీ చీఫ్ వీహెచ్, ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న జగ్గారెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి పోటీ పడుతున్న పరిస్థతి ఉంది.