పవన్, మాయావతి సంయుక్తంగా ఎన్నికల ప్రచారం

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో జనసేన తరపున ప్రచారం నిర్వహించేందుకు బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇవాళ సాయంత్రం ఏపీకి వస్తున్నారు. రేపు, ఎల్లుండి ఆమె ఏపీ, తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు. రేపు విశాఖలో మధ్యాహ్నం పవన్, మాయావతి సంయుక్తంగా మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో జరిగే బహిరంగలో పాల్గొంటారు. ఇక 4వ తేదీ మధ్యాహ్నం తిరుపతిలో నిర్వహించనున్న ఎన్నికల సభలో మాయావతి, పవన్ పాల్గొంటారు. అదేరోజు సాయంత్రం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరుగనున్న బహిరంగ సభకు హాజరవుతారు.