మోడీ రైతు బంధు : ఎలాంటి లాభం లేదంటున్న నిపుణులు

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కిసాన్‌ సమ్మాన్‌ పథకం రైతులకు నిజంగా మేలు చేకూర్చుతుందా? నరేంద్ర మోడీ సర్కార్‌ ప్రకటించిన సాయం...

  • Published By: veegamteam ,Published On : February 8, 2019 / 08:23 AM IST
మోడీ రైతు బంధు : ఎలాంటి లాభం లేదంటున్న నిపుణులు

Updated On : February 8, 2019 / 8:23 AM IST

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కిసాన్‌ సమ్మాన్‌ పథకం రైతులకు నిజంగా మేలు చేకూర్చుతుందా? నరేంద్ర మోడీ సర్కార్‌ ప్రకటించిన సాయం…

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కిసాన్‌ సమ్మాన్‌ పథకం రైతులకు నిజంగా మేలు చేకూర్చుతుందా? నరేంద్ర మోడీ సర్కార్‌ ప్రకటించిన సాయం… సంక్షోభంలో ఉన్న సాగును గట్టెక్కిస్తుందా? పథకం ముసాయిదాలో కేంద్రం పేర్కొన్న నిబంధనల్లో ఏముంది? పెద్దపెద్ద వ్యాపార సంస్థలు ఆఫర్‌లు పెట్టి షరతులు వర్తిస్తాయన్న చందంగా రైతు సమ్మాన్‌ పథకం ఉందన్న ప్రతిపక్షాల మాటలు నిజమేనా?

 

కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం అర్హులను గుర్తించేందుకు మార్గదర్శకాల ముసాయిదాను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కింద ఎవరు అర్హులు, అనర్హులెవరు తెలిపే మార్గదర్శకాల ముసాయిదాను రిలీజ్ చేసింది. పథకం అమలు తీరు పర్యవేక్షించడానికి జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో కమిటీలు వేయనుంది. అలాగే మానిటర్‌ చేయడానికి వీలుగా సెంట్రల్‌ లెవెల్‌లో ప్రాజెక్టు మానిటర్‌ యూనిట్‌ ఏర్పాటు కానుంది. ఈ పథకానికి సంబంధించి ప్రచారం చేయడంతోపాటు ప్రజల్లో అవగాహన కల్పించేలా ఈ విభాగం పనిచేయనుంది. పీఎం కిసాన్‌ పథకం అమలు కోసం రాష్ట్ర స్థాయిలో నోడల్‌ వ్యవస్థ ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఒక ప్రభుత్వ శాఖకు పీఎం కిసాన్‌ పథకం అమలు బాధ్యత అప్పగించాలనేది కేంద్రం యోచనగా కనిపిస్తోంది.

 

దేశ వ్యాప్తంగా 5 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ యోజన పథకం వర్తించనుంది. ఈ పథకం అమలుకు అధికారులు కార్యాచరణ స్పీడ్ పెంచారు. ఇప్పటికే కేంద్రం  నుంచి అధికారులు రాష్ట్రాల పర్యటనలు చేస్తున్నారు. కేంద్రం ఒక్కో రైతుకు ఇచ్చే 6వేల రూపాయల సాయాన్ని 3 విడతలుగా చెల్లించనున్నట్టు ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ మొత్తాన్ని ఏ బ్యాంకు ద్వారా డబ్బును లబ్దిదారులకు అందించాలో రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్‌ చేస్తోంది.

 

దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రైతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లాంటి రాష్ట్రాల్లో రైతులు రోడ్కెక్కి రోజుల తరబడి ఆందోళనలు చేశారు. తమిళనాడు రైతులు ఢిల్లీలో పోరాడారు. అందరి డిమాండ్‌ ఒకటే. సంక్షోభంలో ఉన్న సాగును రక్షించాలని. ఇది కావాలంటే రైతుకు గిట్టుబాటు ధర కావాలి. ఎరువులు, విత్తనాలు, పండిన పంటకు మార్కెటింగ్ అవసరం. వాటి ఊసు లేకుంటే ఆరువేల సాయం ప్రకటిస్తే లాభమేంటని రైతుసంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

 

తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్‌ ప్రభుత్వం విజయవంతంగా రెండు విడతల్లో పంట పెట్టుబడి సాయాన్ని అందించింది. కేసీఆర్‌ సర్కార్‌ తీసుకున్న సంచలనాత్మకమైన ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలను ఆకర్షిస్తోంది. ఇప్పటికే ఒడిషాలో కాలియా పేరుతో అక్కడి ప్రభుత్వం పంటపెట్టుబడి సాయం ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మరోవైపు మోడీ సర్కార్‌ తీసుకున్న 6వేల రూపాయల సాయంపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందన లభిస్తోంది. సాయం చేయాలన్న నిర్ణయాన్ని హర్షిస్తున్నప్పటికీ పథకం కోసం పెట్టిన నిబంధనల పట్ల పెదవి విరుస్తున్నారు వ్యవసాయరంగ నిపుణులు.

 

మోడీ అధికారంలోకి వచ్చాక సాగు ఖర్చులు విపరీతంగా పెరిగాయని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. దేశవ్యాప్తంగా రైతులు అనేక ఆందోళనలు చేశారని గుర్తు చేస్తున్నారు. ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయంటున్నారు. గతంలో ఉన్న పెట్టుబడికి ఈ నాలుగేళ్లలో ఖర్చుతో పోలిస్తే 80శాతం మేర అదనపు భారం రైతుపై పడుతోంది. కేంద్రం ఇచ్చే సాయం ఈ పెరిగిన మొత్తాన్ని కూడా భర్తీ చేయలేదంటున్నారు రైతుం సంఘం నేతలు. పంటలకు గిట్టుబాట ధరలు ఇచ్చి, కేసీఆర్‌ సర్కార్‌ మాదిరిగా ఎకరాకు 10వేల రూపాయల సాయం ఇస్తే రైతుకు కొంత ఉపశమనం లభిస్తోందని చెబుతున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్‌ సమ్మాన్‌ పథకంపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. 5 ఎకరాలలోపు ఉన్న రైతులకు.. అదీ కుటుంబంలో ఒకరికే ఇస్తామనడంతో తెలంగాణలో ఎక్కువ మందికి ఈ పథకం వర్తించకుండా పోతోంది. ఇక ఇచ్చే సాయం కూడా 3 విడతలుగా చేస్తామని చెప్పడం.. ఇదంతా ఎన్నికల కోసమేననే కామెంట్లు వినిపిస్తున్నాయి.