బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

  • Published By: veegamteam ,Published On : May 6, 2019 / 03:26 AM IST
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్

Updated On : May 6, 2019 / 3:26 AM IST

బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్ పేట్ లో రోడ్డు విస్తరణ పనులు ఉద్రిక్తతలకు దారితీశాయి. రెండు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. రాళ్ల దాడి వరకు వెళ్లింది. రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్ఎంసీ అధికారుల.. ఓ స్థలాన్ని కూల్చడానికి వెళ్లారు. దాన్ని ఓ వర్గం వారు వ్యతిరేకించారు. అక్కడ వక్ఫ్ బోర్డు ప్రార్థనా మందిరం ఉండేదని.. అందుకోసం షెడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. మరో వర్గం మాత్రం అక్కడ ఎలాంటి ప్రార్థనా మందిరం లేదని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రాళ్లు రువ్వుకున్నారు.

పరిస్థితులు ఉద్రిక్తతలకు దారి తియ్యడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రంగంలోకి దిగి ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఇంతలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అక్కడికి రావడంతో  పోలీసులు ఆయను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. రాళ్ల దాడిలో కాచిగూడ సీఐ, ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలు అయ్యాయి. ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు పలువురిని పోలీసులు  అరెస్ట్ చేశారు.