బ్రేకింగ్ : దిశ కేసు నిందితులకు పోలీసు కస్టడీ

దిశ కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. నిందితుల కస్టడీకి షాద్ నగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు

  • Published By: veegamteam ,Published On : December 4, 2019 / 12:56 PM IST
బ్రేకింగ్ : దిశ కేసు నిందితులకు పోలీసు కస్టడీ

Updated On : December 4, 2019 / 12:56 PM IST

దిశ కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. నిందితుల కస్టడీకి షాద్ నగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు

దిశ కేసులో నిందితుల పోలీస్ కస్టడీపై సస్పెన్స్ వీడింది. నిందితుల కస్టడీకి షాద్ నగర్ కోర్టు పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో పోలీసులు నలుగురు నిందితులను రేపు(డిసెంబర్ 5,2019) తమ కస్టడీలోకి తీసుకోనున్నారు. ప్రస్తుతం నలుగురు నిందితులు చర్లపల్లి జైల్లో ఉన్నారు. ప్రత్యేక నిఘాలో వారిని ఉంచారు. వారి కోసం కాపలాగా సిబ్బందిని పెట్టారు.

నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు నాలుగు రోజుల క్రితం పిటిషన్ వేశారు. దీనిపై 4 రోజులు విచారించిన కోర్టు.. ఎట్టకేలకు కస్టడీకి పర్మిషన్ ఇచ్చింది. కాగా నిందితులను విచారించేందుకు పోలీసులు 10 రోజుల కస్టడీకి కోరారు. కోర్టు మాత్రం వారం రోజులకే పర్మిషన్ ఇచ్చింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసులో ఇంకా లోతైన విచారణ చేయాల్సి ఉందని.. మరింత సమాచారం తెలుసుకోవాల్సి ఉందని, నిందితులను 10 రోజుల కస్టడీకి అప్పగించాలని షాద్ నగర్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు.

దిశ మొబైల్ ఫోన్‌ రికవరీ చేయాల్సి ఉందని.. నిందితుల వాంగ్మూలం కూడా రికార్డు చెయ్యాల్సి ఉందని పిటిషన్ లో వెల్లడించారు. దిశ కేసులో నిందితులను రిమాండ్‌కు తరలించే రోజు పోలీస్ స్టేషన్ దగ్గర వేలాదిమంది ఉండడంతో నిందితులను పూర్తిగా విచారించలేదని తెలిపారు. దీంతో సానుకూలంగా స్పందించిన కోర్టు నిందితులకు 7 రోజుల కస్టడీని విధించింది.

కాగా, చర్లపల్లి జైలు దగ్గర మూడు రోజులుగా ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అటు నిందితులను అరెస్ట్ చేసి షాద్ నగర్ కోర్టులో ప్రవేశపెట్టిన సమయంలోనూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

నిందితులను తమకు అప్పగించాలని వేలాది మంది ధర్నా నిర్వహించారు. అనంతరం వారిని చర్లపల్లి జైలుకు తరలిస్తున్న సమయంలో బస్సుపై రాళ్ల దాడి కూడా జరిగింది. ఈ క్రమంలో పోలీస్ కస్టడీకి తీసుకుంటున్న సమయంలో మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్లపల్లి జైలు పరిసరాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు.