మిస్టరీ వీడేనా : జూబ్లీహిల్స్‌కు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త, ప్రవాస భారతీయుడు చిగురుపాటి జయరాం డెడ్ బాడీ జూబ్లీ హిల్స్‌లోని ఆయన నివాసానికి చేరుకుంది. చివరిసారి చూసేందుకు బంధువులు, స్నేహితులు ఇంటికి వచ్చి నివాళులర్పిస్తున్నారు. వ్యాపారరంగంలో అంచెలంచెలుగా ఎదిగారని..ఆయన చనిపోవడం బాధగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. అయితే…ఈయన ఎలా చనిపోయాడనేది మిస్టరీగా ఉంది. కృష్ణా జిల్లా త్రిపాఠి స్వయంగా కేసును పర్యవేక్షిస్తున్నారు.
ఈ కేసులో ఒక్కో చిక్కుముడిని విప్పుకుంటూ ముందుకెళుతున్నారు పోలీసులు. ప్రధానంగా జయరాం మేనకొడలు శిఖాతోపాటు ఆమె సోదరి మనీషా, శిఖా బాయ్‌ఫ్రెండ్ రాకేశ్ చౌదరి, స్నేహితుడు శ్రీకాంత్ రెడ్డిలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వీరిని రహస్య ప్రాంతంలో విచారించారు.
హత్య చేయడానికి కిరాయి వ్యక్తులను ఉపయోగించి ఉంటారని…మొత్తం 7గురు ఇందులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. . జయరాం హత్యకు హైదరాబాద్‌లోనే కుట్ర జరిగిందని, మృతదేహాన్ని తరలించేందుకు 2 కార్లు వాడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. జయరాంపై విషప్రయోగం చేసి…హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. జయరాం
శాంపిల్స్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పోలీసులు పంపించారు.
అమెరికా నుంచి ఆయన భార్య పద్మశ్రీ, కొడుకు సాయిరామ్, కూతురు కావ్యశ్రీ హైదరాబాద్‌లోని స్వగృహానికి చేరుకున్నారు. విచారణకు పద్మశ్రీ ఒప్పుకోలేదని తెలుస్తోంది. విచారిస్తే ఎలాంటి కీలకమైన విషయాలు వెలుగు వస్తాయోనన్న ఉత్కంఠ నెలకొంది. మీడియా ముందుకొచ్చి పద్మశ్రీ దీనికి సంబంధించిన విషయాలు..ఇతర కీలక విషయాలు వెల్లడించే అవకాశం ఉంది.