పోలీస్ స్పెషల్ డ్రైవ్: అక్రమ పార్కింగ్ లకు చెక్
లోక్ సభ ఎన్నికల జగరనున్న క్రమంలో నగరంలో అక్రమ పార్కింగ్ లకు పోలీసులు చెక్ పెట్టనున్నారు.

లోక్ సభ ఎన్నికల జగరనున్న క్రమంలో నగరంలో అక్రమ పార్కింగ్ లకు పోలీసులు చెక్ పెట్టనున్నారు.
హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల జగరనున్న క్రమంలో నగరంలో అక్రమ పార్కింగ్ లకు పోలీసులు చెక్ పెట్టనున్నారు. నో పార్కింగ్ బోర్డు ఉన్నా సరే ఏమాత్రం పట్టించుకోకుండా ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న క్రమంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నగర ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్‌కుమార్ సిబ్బంది ఆదేశించారు.
Read Also : మద్యంపై ఆంక్షలు: 6 మించి అమ్మొద్దు..గీత దాటితే వాతే
నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సోమవారం (ఏప్రిల్ 8)కమిషనర్ అనిల్‌కుమార్ సమీక్ష నిర్వహించారు. షాపులు..షాపింగ్ మాల్స్ అపార్ట్ మెంట్స్ ముందు అక్రమ పార్కింగ్ చేసినా..ఆయా యజమాన్యాలపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ పార్కింగ్ వెహికల్స్ ను ఫోటోలు తీసి వాటిపై కేసులు నమోదు చేయాలని తెలిపారు.
ఈ క్రమంలో సోమవారం నుంచి అక్రమ పార్కింగ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అంతేకాదు పుట్‌పాత్‌లపై నుంచి టూ వీలర్స్ లు వెళ్తున్నాయనీ వాటిని అడ్డుకోవాలని..పుట్‌పాత్‌లు పాదచారుల కోసం ఏర్పాటు చేసినవని వాహనాదారులకు సూచించాలని అదనపు సీపీ సూచించారు.
Read Also : జగన్ హామీ : లోకేష్‌పై ఆర్కేని గెలిపిస్తే మంత్రి పదవి