కూల్ వెదర్ : హైదరాబాద్‌లో వర్షం

  • Published By: veegamteam ,Published On : January 26, 2019 / 07:00 AM IST
కూల్ వెదర్ : హైదరాబాద్‌లో వర్షం

హైదరాబాద్ చల్లగా ఉంది. వర్షంతో వాతావరణం చల్లగా మారింది. ఇన్నాళ్లు చలి పంజాతో వణికిన జనం.. ఇప్పుడు వర్షంతో పులకిస్తున్నారు. వీకెండ్‌తోపాటు రిపబ్లిక్ డే కావటంతో అందరూ ఇళ్లల్లోనే ఉన్నారు. చల్లటి గాలులను ఎంజాయ్ చేస్తున్నారు. హైదరాబాద్ సిటీ మొత్తం ఇలాంటి వెదర్ ఉంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్, కాప్రా, మౌలాలి, కూకట్‌పల్లి, హైటెక్ సిటీ ఏరియాల్లో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో చిరు జల్లులతో వాతావరణం ఆహ్లాదంగా మారింది.

హైదరాబాద్ సిటీలో ఇప్పటికే కనిష్ఠ ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదు అవుతున్నాయి. 14-15 డిగ్రీలుగా ఉంది. ఇప్పుడు వర్షం పడుతుండటంతో చలి మరింత పెరిగింది. వీకెండ్ వర్షం.. కూల్ వెదర్ తో ఇంటిల్లోనే ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తున్నారు జనం. రోడ్లపై ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంది. హిందూ మహాసముద్రం-దక్షిణ బంగాళాఖాతం మధ్య ప్రాంతంలో ఏర్పడిన అల్ప పీడనానికి తోడు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతోనే హైదరాబాద్ తోపాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడుతుంది.