మిస్టరీ వీడింది : జయరాంను చంపింది రాకేష్

హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామిక వేత్త ఎన్ఆర్ఐ చిగురుపాటి జయరాంను మర్డర్ చేసింది రాకేష్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రూ. 4.5 కోట్ల వ్యవహారమే హత్యకు దారి తీసిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నుండి జయరాంను కారులో విజయవాడకు తీసుకెళ్లి..కారులోనే హత్య చేసి నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారి పక్కనే కారును వదిలేసి పరారయ్యారు. ఏదో ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ..రాకేష్ ఒక్కడే కలిసి హత్య చేయడని అనుమానిస్తున్న పోలీసులు ఇతర విషయాలపై దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే చిగురుపాటి సతీమణి మీడియా ఎదుట రానున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.