Rapido driver : పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌.. రాపిడో రైడర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

ఓ వ్యక్తి రాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాడు. వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోవటంతో బైక్ ఆగిపోయింది. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడ్చుకుంటూ రావాలని కస్టమర్ ను కోరాడు.

Rapido driver : పెట్రోల్ అయిపోయినా బైక్ దిగని కస్టమర్‌.. రాపిడో రైడర్ ఏం చేశాడంటే? వీడియో వైరల్

Rapido driver

Hyderabad Rapido driver : హైదరాబాద్ లో మనం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే బస్సు, మెట్రోను ఆశ్రయిస్తాం. అలాకాకుండా.. ఇంటి వద్ద నుంచే మనం వెళ్లాలనుకున్న ప్రదేశానికి పోవడానికి ఊబర్, ర్యాపిడో వంటి ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం నగరంలో అధికశాతం మంది ఉద్యోగుల, పలు రంగాల వారు తమ గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీటినే ఉపయోగిస్తున్నారు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో వాహన రైడర్స్ కానీ, ఒక్కోసారి కస్టమర్లు కానీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ర్యాపిడో డ్రైవర్ కష్టాలనుచూసి అయ్యో పాపం అంటున్నారు.

Also Read : SGB Scheme : మార్కెట్ కంటే తక్కువ ధరకు స్వచ్ఛమైన బంగారం.. కేవలం ఐదు రోజులే అవకాశం.. ఎక్కడో తెలుసా?

ఓ వ్యక్తి రాపిడో యాప్ లో బైక్ బుక్ చేసుకున్నాడు. వెళ్తున్న క్రమంలో మార్గం మధ్యలో పెట్రోల్ అయిపోవటంతో బైక్ ఆగిపోయింది. దగ్గర్లో ఉన్న పెట్రోల్ బంక్ వరకూ నడ్చుకుంటూ రావాలని కస్టమర్ ను కోరాడు. కానీ, కస్టమర్ అందుకు నిరాకరించాడు. దీంతో చేసేది ఏమీలేక కస్టమర్ ను బైక్ పైనే కూర్చోబెట్టుకొని ర్యాపిడో డ్రైవర్ బైక్ ను తోసుకుంటూ వెళ్లాల్సిన వచ్చింది. ఆ సమయంలో ఆటోలో వెళ్తున్న కొందరు వ్యక్తులు వీడియోను తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు అయ్యో పాపం.. ఇలా చెయ్యడం తప్పుబ్రో అంటూ కస్టమర్ పై ఫైర్ అవుతున్నారు. మరికొందరు నెటిజన్లు.. కస్టమర్ కు ఏమైనా హెల్త్ ప్రోబ్లమ్ ఉందేమో, నడవలేని స్థితిలో ఉన్నాడేమో అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

Also Read : Actor Nandu : స్టేజిపై ఏడ్చేసిన నందు.. నాకు సంబంధం లేకపోయినా నా గురించి వార్తల్లో అలా..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఇది ర్యాపిడో కు సంబంధించిన బైక్ అనేది నిర్ధారణ ఎక్కడాలేదు.  అయితే, ఆటోలో నుంచి వీడియో తీస్తున్న సమయంలో ఇది ర్యాపిడో అని వాళ్లు మాట్లాడుకోవటం మనం వినొచ్చు.