బీ కేర్ ఫుల్ : TRS ఆఫీసు సమీపంలో కుంగిన రోడ్డు

  • Published By: madhu ,Published On : March 4, 2019 / 02:27 PM IST
బీ కేర్ ఫుల్ : TRS ఆఫీసు సమీపంలో కుంగిన రోడ్డు

Updated On : March 4, 2019 / 2:27 PM IST

హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ రోడ్డు కుంగిపోతుందో తెలియదు. రయ్యి మంటూ దూసుకొచ్చే వాహనాలు గుంతలో పడి పలు ప్రమాదాలు ఎదురవుతున్నాయి. ఇటీవలే ఎన్టీఆర్ మార్గ్ భవన్‌లో రోడ్డు కుంగిన సంగతి తెలిసిందే. తాజాగా మార్చి 04వ తేదీ సోమవారం నగరంలో రోడ్డు కుంగడం కలకలం రేపింది. 

నగరంలో ఎప్పటి నుండో డ్రైనేజీ వ్యవస్థ అలాగే ఉంది. భూమిలోపల ఎన్నో ఏళ్ల నుండి పైపులు అలాగే ఉండడం..అవి అక్కడకక్కడ లీక్ అవుతున్నాయి. దీనితో రోడ్డు గుంతలమయంగా తయారవుతోంది. తెలంగాణ భవన్ సమీపంలో సోమవారం రోడ్డు ఒక్కసారిగా రోడ్డు కుంగిపోయింది. శివరాత్రి పండుగ కావడంతో రోడ్లపై అంతగా రద్దీ లేదు. అయితే ఇద్దరు వాహనదారులు అందులో పడిపోయారు. వెంటనే రోడ్డుపై వెళుతున్న ఇతరులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. వేరే వారికి ప్రమాదం జరగవద్దని భావించి గుంతకు ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు.  ఇతర వాహన దారులను అలర్ట్ చేశారు. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ, జలమండలి అధికారులు చర్యలు చేపట్టారు.