ఒక్క నెలలో మందుబాబుల నుంచి రూ. 2కోట్ల 25లక్షలు వసూలు

  • Published By: vamsi ,Published On : February 4, 2020 / 01:07 AM IST
ఒక్క నెలలో మందుబాబుల నుంచి రూ. 2కోట్ల 25లక్షలు వసూలు

Updated On : February 4, 2020 / 1:07 AM IST

కొత్త ఏడాదిలో ట్రాఫిక్ నిబంధనల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే  రోడ్డుపై ప్రయాణికులు, వాహనదారుల భద్రతను కాపాడే దిశగా అడుగులు వేస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.

మందుబాబులపై చర్యలు కఠినతరం చేస్తూ.. ఒక్క జనవరి నెలలో డ్రంకెన్‌ డ్రైవ్‌ చేస్తూ 2,254 మంది పోలీసులకు పట్టుబడ్డారు. చార్జిషీట్‌ దాఖలు చేసి వారిని నాంపల్లిలోని 3వ, 4వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు.

అందులో 290 మందికి జైలు శిక్ష విధించగా, ఇద్దరి లైసెన్స్‌లు శాశ్వతంగా రద్దు, ఒకరిది ఆరు నెలలపాటు రద్దు చేశారు పోలీసులు. అంతేకాదు చలాన్ల రూపంలో రూ. 2,25,81,400(రూ.2కోట్ల 25లక్షలు) వసూలు చేశారు. జైలు శిక్ష పడిన వారితోపాటు డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనాలు నడిపిన వారిలో ముగ్గురికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు జైలు శిక్ష విధించింది కోర్టు.