మలక్ పేట్ లో టీవీ టవర్ ఎక్కిన ఆర్టీసీ ఉద్యోగి
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.

హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు.
హైదరాబాద్ లోని మలక్ పేట్ లో ఉన్న టీవీ టవర్ ఎక్కాడు ఓ ఆర్టీసీ ఉద్యోగి. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఘటనాస్థలికి భారీగా ఆర్టీసీ ఉద్యోగులు చేరుకున్నారు. సమాచారం తెలుసుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. టీవీ టవర్ దిగాలంటూ ఆర్టీసీ ఉద్యోగికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే పలు చోట్ల ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు.
37 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఇవాళ అఖిలపక్షంతో కలిసి సమావేశమైన ఆర్టీసీ జేఏసీ… భవిష్యత్ కార్యాచరణ రూపొందించింది. సమ్మెను మరింత ఉధృతం చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల ఇళ్ల ముందు రేపు నిరసన తెలపాలని కార్మికులు పిలుపు ఇచ్చింది.