నివాసంలోనే అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష : సీఎం విధానాలతోనే కార్మికుల ఆత్మహత్యలు

హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

  • Published By: veegamteam ,Published On : November 16, 2019 / 05:46 AM IST
నివాసంలోనే అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్ష : సీఎం విధానాలతోనే కార్మికుల ఆత్మహత్యలు

Updated On : November 16, 2019 / 5:46 AM IST

హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

హైదరాబాద్ లోని వనస్థలిపురం బీఎన్ రెడ్డి నగర్ లో టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆయన నివాసంలోనే నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. పూల మాల ధరించి దీక్షను ప్రారంభించారు. ఆయనతోపాటు పలువురు మహిళలు కూడా ఉన్నారు. ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ సీఎం విధానాలతోనే కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు. చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. మరో మిలియన్ మార్చ్, మరో సాగరహారం కూడా చేపడతామన్నారు. ఆర్టీసీ జేఏసీ నాయకుల అరెస్టులను ఖండిస్తున్నామని తెలిపారు.

కార్మికులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. అంతిమ విజయం మనదే అన్నారు. ప్రజలను, కోర్టులను ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తప్పుదోవపట్టిస్తున్నారని మండిపడ్డారు. చర్చలతో సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నామని చెప్పారు. జేఏసీ నేతలను అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నారని తెలిపారు. పోలీసులు అక్రమ అరెస్టులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అరెస్టు చేసినా దీక్ష కొనసాగిస్తామని చెప్పారు. 

43 రోజులుగా శాంతియుతంగా సమ్మె చేస్తున్నామని..కార్మికుల సమస్యలు పరిష్కరించకపోగా ప్రభుత్వం దమనకాండ ప్రదర్శిస్తుందన్నారు. మహిళా కార్మికులు అని చూడకుండా ట్యాక్ బండ్ పై వారిపై దాడి చేశారని వాపోయారు. కోరి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి ప్రవర్తన చాలా దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. 

ప్రధాన డిమాండ్ అయిన ప్రభుత్వంలో ఆర్టీసీ వీలినాన్ని తాత్కాలికంగా పక్కనబెట్టినట్లు చెప్పారు. చర్చలు జరుపకుండా, సమస్యలు పరిష్కరించుకుండా, నాయకుల ఇళ్లపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కో కోన్వీనర్ రాజిరెడ్డితోపాటు డిపోల దగ్గర నిరసన తెలుపుతున్న నేతలను అరెస్టు చేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తలపిస్తుందన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. కార్మికులు ఎవరూ భయపడద్దని..ధైర్యంగా ఉండాలన్నారు. ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు.

జేఏసీ నేతల దీక్ష పిలుపుతో టెన్షన్ నెలకొంది. దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు బస్ రోకో, అన్ని డిపోల ఎదుట ఆందోళన చేపట్టారు. జిల్లాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. జేఏసీ నేతలు దీక్షకు దిగకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. జేఏసీ నేతల ఇళ్లు, ఈయూ ఆఫీస్ దగ్గర పోలీసులు మోహరించారు. అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ జేఏసీ ముఖ్య నేతల ఇళ్ల ముందు పోలీసులు భారీగా మోహరించారు. అటు ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయం దగ్గ భారీగా పోలీసులు మోహరించారు.