ఆర్టీసీ విలీనం డిమాండ్ కరెక్ట్ కాదు: కేసిఆర్‌కు జయప్రకాశ్ నారాయణ సపోర్ట్

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు తలపెట్టిన సమ్మెపై విపక్షాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు కేసీఆర్‌పై విమర్శలు ఎక్కిపెడుతున్నాయి. ఈ క్రమంలో లేటెస్ట్‌గా ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ సీఎం కేసిఆర్ నిర్ణయానికి లోక్ సత్తాపార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మద్దతు పలికారు. సమ్మె విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సంఘీభావం ప్రకటించారు.
ఆర్టీసీ కార్మికులు విలీనం చేయాలంటూ సమ్మెకి దిగడం సరికాదని అన్నారు. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె అసంబద్ధమని అన్నారు. ఆర్టీసీ విలీనం అనేది అర్థం లేని డిమాండ్ అని సమస్యలను చర్చించి పరిష్కరించుకోవాలే తప్ప ఇలా సమ్మెలతో ఎలాంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు జయప్రకాశ్ నారాయణ.
ఆర్టీసీ కార్మికుల సమస్యను జాతి సమస్యగా మార్చడం కరెక్ట్ కాదని అన్నారు. ఇది కేసిఆర్‌కు ఆర్టీసీ కార్మికుల మధ్య సమస్య కాదని అన్నారు. కార్మికులను అన్యాయంగా దెబ్బకొట్టడం సరికాదని అన్నారు. సెంటిమెంట్ తీసుకుని రావడం.. ఉద్వేగానికి లోను చేయడం.. తద్వారా ఆత్మహత్యలకు పాల్పడేలా చేయడం కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కార్మికుల సమస్యలను సమస్యాత్మకం చేయడం కరెక్ట్ కాదని అన్నారు.