మేము సైతం : మొక్కలు నాటిన తేజ్, రాశీ ఖన్నా

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గ్రీన్ చాలెంజ్. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే

  • Published By: veegamteam ,Published On : December 19, 2019 / 12:54 PM IST
మేము సైతం : మొక్కలు నాటిన తేజ్, రాశీ ఖన్నా

Updated On : December 19, 2019 / 12:54 PM IST

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గ్రీన్ చాలెంజ్. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకొచ్చిన కార్యక్రమం గ్రీన్ చాలెంజ్. ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే అనేకమంది సెలబ్రిటీలు మొక్కలు నాటి.. పర్యావరణ పరిరక్షణలో భాగమయ్యారు. తాజాగా “ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్” ఆధ్వర్యంలో గ్రీన్ చాలెంజ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.

”ప్రతిరోజూ పండగే” మూవీ టీమ్ సందడి చేసింది. హీరో, హీరోయిన్లు సాయి ధరమ్ తేజ్, రాశీ ఖన్నా, దర్శకుడు మారుతి, నగర మేయర్ బొంతు రామ్మెహనన్, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్.. బంజారాహిల్స్ లోని శ్రీనికేతన్ కాలనీ పార్క్ లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత SKN, ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ఉప అధ్యక్షులు రాంబాబు, శేఖర్, ప్రధాన కార్యదర్శి నాయుడు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ చాలెంజ్ తనను బాగా ఆకర్షించిందని హీరో తేజ్ చెప్పారు. ఫిల్మ్ న్యూస్ క్యాస్టర్స్ అసోసియేషన్ గ్రీన్ చాలెంజ్ లో తనను భాగం చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని కాపాడాలని తేజ్ పిలునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అన్నారు.

గ్రీన్ చాలెంజ్ ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి హీరోయిన్ రాశీ ఖన్నా స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. కాలుష్యం బాగా పెరిగిపోయిన ఈ రోజుల్లో గ్రీన్ చాలెంజ్ చాలా అవసరం అన్నారు. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరు గ్రీన్ చాలెంజ్ లో భాగస్వామ్యం అవడం బాధ్యతగా తీసుకోవాలని దర్శకుడు మారుతి అన్నారు. మనం మొక్కలు నాటడమే కాకుండా మరో ముగ్గురితో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. ప్రతీరోజూ పండగే టీమ్ తో గ్రీన్ చాలెంజ్ లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ప్రకృతిని కాపాడుకోవడం అందరి బాధ్యత అని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు.