షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

  • Published By: veegamteam ,Published On : October 25, 2019 / 03:39 PM IST
షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

Updated On : October 25, 2019 / 3:39 PM IST

ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు.

ఎల్బీనగర్ షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు సునీల్ కుమార్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. శుక్రవారం (అక్టోబర్ 25, 2019) షైన్ ఆస్పత్రి ఎండీ సునీల్ కుమార్ రెడ్డిని అరెస్టు చేశారు. షైన్ ఆస్పత్రి అగ్నిప్రమాదంలో బాలుడు మృతికి కారణమైన సునీల్ కుమార్ రెడ్డి పాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సునీల్ కుమార్ అరెస్టును గోప్యంగా ఉంచిన ఎల్బీ నగర్ పోలీసులు.. మీడియాకు చూపించకుండా కోర్టులో హాజరుపర్చారు. సునీల్ కుమార్ రెడ్డికి రంగారెడ్డి జిల్లా కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

ఇప్పటికే షైన్ ఆస్పత్రి ఘటనపై జిల్లా వైద్య శాఖ అధికారులు పూర్తి నివేదిక సమర్పించారు. మరోవైపు సునీల్ కుమార్ రెడ్డి గోప్యంగా ఉంచిన పోలీసుల తీరుపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. షైన్ ఆస్పత్రి నాలుగో అంతస్తుకు అనుమతి లేదని పోలీసుల విచారణలో తేలింది. షైన్ ఆస్పత్రిలో జరిగిన ఘటనపై రాచకొండ పోలీసులు శుక్రవారం (అక్టోబర్ 25, 2019) పత్రికా ప్రకటన కూడా విడుదల చేశారు. సునీల్ కుమార్ రెడ్డితోపాటు మరో నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రధానంగా డ్యూటీ డాక్టర్ గా ఉన్న హరికృష్ణ, డ్యూటీ నర్సులు స్రవంతి, దీపికతోపాటు మరో నర్సుపై కేసు నమోదు చేశారు. 

పోలీసులు కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రమాదానికి ప్రధాన కారణం అధికారుల నిర్లక్ష్యంతోపాటు యాజమాన్యం నిర్లక్ష్యంగా కూడా పూర్తి స్థాయిలో ఉందని విచారణలో వెల్లడించారు. ఆస్పత్రి నాలుగో అంతస్తులోని ఎమర్జెన్సీ వార్డులో ఫ్రిడ్జ్ బ్లాస్ట్ అయింది. ఎమర్జెన్సీ వార్డులో ఒక్క డ్యూటీ డాక్టర్, నర్సు కూడా లేరని పోలీసుల విచారణలో వెల్లడైంది. మరోవైపు మంటలు వ్యాపిస్తుండటంతో సకాలంలో ఎవరు కూడా స్పందించలేదని…. సకాలంలో స్పందిస్తే బాలుడు చనిపోయే వాడు కాదని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆస్పత్రిలో నిర్లక్ష్యం వహించిన సునీల్ కుమార్ రెడ్డి, డ్యూటీ డాక్టర్ తోపాటు నలుగురు నర్సులపై పోలీసులు కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు.

తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఇప్పటికే షైన్ ఆస్పత్రి ఘటనపై పూర్తి నివేదిక సమర్పించాలని క్రమంలో షైన్ ఆస్పత్రికి సంబంధించిన పూర్తి వివరాలు, అగ్ని ప్రమాదంపై వివరాలను రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. యాజమాన్యం నిర్లక్ష్యం, నియమ నిబంధనలు పాటించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని రిపోర్టులో ప్రాథమికంగా వెల్లడించారు. అయితే నగరంలో ఉన్న ఇలాంటి ఆస్పత్రులపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి మరి.