పోలీసులపై రాళ్లదాడి చేయడంతోనే ఎన్‌కౌంటర్

  • Published By: vamsi ,Published On : December 6, 2019 / 02:44 AM IST
పోలీసులపై రాళ్లదాడి చేయడంతోనే ఎన్‌కౌంటర్

Updated On : December 6, 2019 / 2:44 AM IST

దిశ అత్యాచారం, హత్య కేసులో నిందితులు నలుగురు పోలీసు ఎన్‌కౌంటర్‌‍లో మృతి చెందారు. సీన్ రీ కనస్ట్రక్షన్ సందర్బంలో పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. షాద్‌నగర్ కోర్టు ఆదేశం మేరకు పోలీసులు చర్లపల్లి జైలు నుండి నిందితులను కస్టడీకి తీసుకోగా.. చర్లపల్లి జైలు నుంచి తీసుకెళ్లి సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తున్న సమయంలో వారు తప్పించుకునే ప్రయత్నం చేశారు. 

తెల్లవారుజామున 3గంటల 30నిమిషాలకు ఎన్‌కౌంటర్ చటాన్ పల్లి దగ్గర ఎక్కడైతే పెట్రోల్ పోసి దిశను చంపారో అక్కడే వారి ఎన్‌కౌంటర్ కూడా జరిగింది. సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో భాగంగా హత్యాచారం చేసిన ఘటనకు రాత్రి 12గంటల తర్వాత పోలీసులు వారిని తీసుకుని వెళ్లగా.. పెట్రోల్ కొన్న చోటకు తీసుకుని వెళ్లారు. తర్వాత ఎక్కడైతే దిశను చంపారో? నలుగురిని అక్కడికి తీసుకుని వెళ్లారు. 

పెట్రోల్ ఎవరు పోశారు? ఎవరు చంపారు? అనే విషయాలను క్లియర్ గా కనుక్కుంటున్న సమయంలో నిందితుల్లో ఒకరైన ఆరీఫ్ పోలీసులపై దాడి చేశాడట. తర్వాత మిగిలిన ముగ్గురు పోలీసుల వద్ద ఆయుధాలు లాక్కునే ప్రయత్నం చేశారు. అది కుదరకపోవడంతో పరిగెత్తి పారిపోతూ.. పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో తప్పని పరిస్థితిలో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.