చిత్రం : క్రింది ఫ్లోర్ కూలింది పై ఫ్లోర్ మిగిలింది

ఎక్కడైన భవనాలు కూలితే..ఆ భవనం పూర్తిగా కూలిపోవచ్చు..లేదా కొన్ని అంతస్థులు మిగిలిపోవచ్చు. కానీ కింది ఫ్లోర్ కూలిపోయి..ఫై ఫ్లోర్ చక్కగా కూలి నేలకు తాకటం కొంచెం అరుదు అని చెప్పుకోవాలి. అటువంటి ఘటన హైదరాబాద్ లోని గోషామహల్ లో జరిగింది. ఈ భవనం విచిత్రంగా కూలింది. క్రింది ఫ్లోర్ కూలిపోయి పూర్తిగా ధ్వంసమైంది. కింది ఫ్లోర్ కూలిపోవటంతో పై ఫ్లోర్ మాత్రం జాగ్రత్తగా కూలినట్లుగా..నేలపై జాగ్రత్తగా చేరినట్లుగా తాకింది. పై ఫ్లోర్ కు పెద్దగా ధ్వంసం కాకపోవటం విశేషం.
అది 60 సంవత్సరాల క్రితం నిర్మించిన రెండు అంతస్థుల భవనం. దాంట్లో ఓ కుటుంబం నివసిస్తోంది. ఈ క్రమంలో అక్టోబర్ 2వ తారీఖులను ఈ భవనం కుప్పకూలిపోయింది. గత కొంత కాలం నుంచి హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనం కావటంతో పునాదులు నానిపోయాయి. దీంతో పెచ్చులు ఊడి పడుతున్నాయి. దీంట్లో ఉండటం క్షేమం కాదని భావించిన సదరు కుటుంబ రెండు రోజుల క్రితం ఇంటిని ఖాళీ చేసి..మరోచోట ఉంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే పాత భవనంగా మారిన 60 ఏళ్లనాటి ఈ భవనానికి రెండు ప్రక్కల కొన్ని అనధికార నిర్మాణలు జరుగుతుండటంతో తవ్వాకాలు జరుగుతున్నాయి. దీనికి తోడు ఇటీవల భారీగా కురుస్తున్న వర్షాలకు ఈ భవనం బలహీనపడింది. దీంతో క్రింది అంతస్థు కూలిపోయింది. కానీ పై అంతస్థులు మాత్రం ఏమాత్రం చెక్కు చెదరకుండా నేలకు తాకింది.
తమ భవనం కూలిపోవటానికి కారణం తమ ఇంటి పక్కనే అనధికారికంగా కడుతున్న అపార్ట్ మెంట్లేనని..దానికి సంబంధించి పిల్లర్స్ నిర్మాణాలకు లోతుగా గోతులు తవ్వటం వల్లనే తమ ఇల్లు కూలిపోయిందని యజమాని శ్రీధర్ ఆరోపిస్తున్నాడు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఏమాత్రం పట్టించుకోవలేదని వాపోతున్నాడు. దీన్ని నూతనంగా నిర్మాణం చేస్తున్న యజమానలు కొట్టిపారేస్తున్నారు.
కూలిపోయిన ఇంటికి పురాతనమైనది కావటం..దానికి పిల్లర్లు నిర్మించకపోవటం ఇంటికి సమీపంలోనే ఉన్న మురికి కాలువ..దీనికి తోడు భారీగా కురుస్తున్న వర్షాల వల్లే ఇల్లు కూలిపోయిందని అంటున్నారు. అదృష్టవశాత్తు ఇంటి యజమానులు ఖాళీ చేసినందు వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు అంటున్నారు. ధ్వంసం కాగా..మిగిలి ఉన్న ఫ్లోర్ ను జీహెచ్ ఎంసీ అధికారులు తొలగిస్తున్నారు.