సమ్మె ఎఫెక్ట్ : గ్రేటర్ ఆర్టీసీకి రూ.12 కోట్లు నష్టం
అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది.

అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది.
హైదరాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. షెడ్యూల్ ప్రకారం బస్సులు నడిపిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆర్టీసీ బస్సులు అధికశాతం డిపోలకే పరిమితమయ్యాయి. అధికారులు తాత్కాలిక ఉద్యోగులతో తక్కువ సంఖ్యలో ఆర్టీసీ, అద్దె బస్సులను నడిపిచండంతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు.
హైదరాబాద్‌లో బస్సులు పూర్తిస్థాయిలో రోడ్డెక్కకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు సమ్మెపై ఆర్టీసీ కార్మికులు మెట్టు దిగకపోవడం.. ఈ విషయంలో ప్రభుత్వం కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తుండటంతో.. పండగకు సొంత ఊర్లు వెళ్లిన వారు నగరానికి రాడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన గ్రేటర్ ఆర్టీసీ.. కార్మికుల సమ్మెతో కుదేలవుతోంది. ఈ నెల నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో గ్రేటర్ ఆర్టీసీ ఐదు రోజుల్లో రూ.12 కోట్లు నష్టపోయింది. పండుగ సమయంలో లాభమార్జించే అవకాశం ఉన్నప్పటికీ సమ్మెబాట పట్టడంతో .. ఆర్టీసీ ఆదాయాన్ని క్యాబ్‌లు, ఆటోరిక్షాలు, ఎంఎంటీఎస్, మెట్రోరైలు, ఇతర ప్రైవేటు ఆపరేటర్ల పరమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సమ్మె నివారణకు చర్యలు తీసుకున్నప్పటికీ కార్మిక సంఘాలు మెట్టుదిగక పోవడంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం .. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.