మండుతున్న ఎండలు : కొత్తగూడెంలో @42.2 డిగ్రీలు

తెలంగాణ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతన్నాయి. ఎండలకు తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. మార్చి నెలాఖరులోనే 40 డిగ్రీల అధిక టెంపరేచర్స్ నమోదవుతుండడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఏప్రిల్, మే మాసంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇదిలా ఉంటే మార్చి 29వ తేదీ పలు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
భద్రాది కొత్తగూడెం జిల్లాలో 42.2 డిగ్రీలు, కరీంనగర్ జమ్మికుంట, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 42 డిగ్రీలు, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘన్ పూర్, ములుగు మండలం చెలపూర్‌లలో 41.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.