సోమవారం నుంచి ఎండలు

హైదరాబాద్: శ్రీలంక సమీపంలోని కుమరీన్ ప్రాంతం నంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఉన్నందున పగటి ఉష్ణోగ్రతలు శనివారం నాడు సాధారణం కంటే 3 డిగ్రీలు తగ్గాయని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 32 నుంచి 38 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా సంగారెడ్డి, వనపర్తి జిల్లాల్లో 38 డిగ్రీలు రికార్డయింది. ఆదివారం నుంచి ఉపరితల ద్రోణి ప్రభావం తగ్గి పొడి వాతావరణం ఏర్పడుతుందని, సోమవారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు వివరించారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు స్థిరంగా కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. శనివారం నగరం లో గరిష్ఠ ఉష్ణోగ్రత సాధారణం కంటే 2.1 డి గ్రీలు పెరిగి 33.1 డిగ్రీలుగా, కనిష్ఠం 5.2 డి గ్రీలు పెరిగి 22.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు తెలిపారు. ఆది, సోమవారాలు పొడివాతావరణం ఉంటుందని పేర్కొన్నారు.