స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి

శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్  తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.

  • Published By: veegamteam ,Published On : March 18, 2019 / 05:58 AM IST
స్వైన్ ఫ్లూ అలర్ట్ : రాజకీయ ర్యాలీల్లో జాగ్రత్తగా ఉండండి

శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్  తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి.

హైదరాబాద్ : శీతాకాలం సీజన్ ప్రారంభం నుంచి స్వైన్ ఫ్లూ వైరస్  తెలంగాణ రాష్ట్రంలో విజృంభించటంతో పలు కేసులు నమోదు కావటం.. కొన్ని మరణాలు కూడా సంభవించాయి. ఈ క్రమంలో 35 కొత్త కేసులను కూడా గుర్తించినట్లు ఆరోగ్య నిపుణులు తెలిపారు.  లోక్ సభ ఎన్నికలు జరగనున్న క్రమంలో ప్రజలు తగిన జాగ్రతలతో  ఉండాలని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికలు.. కొత్తగా స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావటంతో రాజకీయ సమావేశాలు..ర్యాలీలు.. బహిరంగ సభలలో  ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొంటుంటారు. ఇటువంటి సందర్భాలలో ప్రజలు మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.   
Read Also : నాలుగు జిల్లాల్లో చంద్రబాబు ప్రచారం

ఆరోగ్య అధికారులు ప్రకటించిన ప్రకారంగా చూస్తే.. రాష్ట్రంలో ఫిబ్రవరి 1, మార్చి 10 మధ్య 563 మందికి స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. వారిలో 12 మంది మంది మృతి చెందారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ నాయకులు బహిరంగ ర్యాలీలను నిర్వహిస్తుండటంతో జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్స్.. (DMHO)ఆస్పత్రి సూపరింటెండెంట్ల సమావేశమయ్యారు. స్వైన్ ఫ్లూకు లక్షణాలపై ఎటువంటి అనుమానం ఉన్నా సరే వెంటనే వైద్యులకు సంప్రదించాలని సూచించారు. 

దీని కోసం ఆరోగ్య అధికారులు 2018 అక్టోబర్ నుంచి స్వైన్ ఫ్లూ పై పలు అవగామన కార్యక్రమాలను కొనసాగించారు. ఈ కార్యక్రమాలు డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలల్లో పూర్తిస్థాయికి చేరుకున్నాయి. ఈ కార్యక్రమాలతో మార్చి నెలాఖరు నాటికి స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య తగ్గుతుందని భావించారు. కానీ వేసవి వచ్చినా.. ఎండల తీవ్రత పెరుగుతున్నా ..ఆ వైరస్ ఇప్పటికీ యాక్టివ్ గానే ఉందని తెలిపారు.

స్వైన్ ఫ్లూ వైరస్.. తోటి వ్యక్తులు దగ్గినా.. లేదా తుమ్మినా.. ఆ ప్రభావం గాలిలో కలిసి పక్కన ఉండే వ్యక్తులకు ఈజీగా వ్యాపిస్తుందనీ.. ఎన్నికల ర్యాలీలు.. మీటింగ్స్ వంటి సందర్భాలలో అది ఎక్కువయ్యే అవకాశాలు చాలా ఉంటాయని సూచిస్తున్నారు. ఇటువంటి సమావేశాలకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య విభాగం సీనియర్ అధికారి హెచ్చరించారు. 
Read Also : సెంటిమెంట్: ముహూర్తాలు చూస్తున్న అభ్యర్థులు