ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు : చేసేందుకు టెక్నీషియన్ లేరు

  • Published By: veegamteam ,Published On : February 20, 2019 / 06:53 AM IST
ఐటీలో 5 లక్షల ఉద్యోగాలు : చేసేందుకు టెక్నీషియన్ లేరు

Updated On : February 20, 2019 / 6:53 AM IST

హైదరాబాద్ :  ఐటీ పరిశ్రమల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌డేటా అనలిటిక్స్‌ టెక్నాలజీకి డిమాండ్‌ బాగా పెరుగుతోంది. దీనికి సంబంధించి ఐటీ రంగానికి టెకీలు మాత్రం దొరకడం లేదని నాస్కాన్‌ వెల్లడించింది. కొత్త టెక్నాలజీ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిపుణులు దొరకడంలేదని, ఉన్న ఉద్యోగుల్లో 50శాంత మందికి కొత్తగా టెక్నాలజీ నేర్పించాల్సిందేనని నాస్కామ్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ తెలిపింది. 
 

2018లో  డిమాండ్‌కు తగ్గ స్థాయిలో ఐటీ నిపుణులు  దొరక్కపోవడంతో ఐటీ పరిశ్రమలు పలు ఇబ్బందులకు ఎదుర్కొన్నాయి. ఐటీ ఇండస్ట్రీలో పలు  రంగాల్లో 5 లక్షల 40వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ డిమాండ్ కు తగిన టెకీలు మాత్రం దొరకటంలేదు. దీంతో 40వేల ఉద్యోగాలను భర్తీ కావటంలేదు. 2021 నాటికి ఐటీ పరిశ్రమలో నిపుణుల కొరత 2 లక్షల 20 వేలకు చేరుకోనుందని పలు అధ్యయనాలు వెల్లడించటం ఆందోళనకలిగిస్తోంది. 
 

2024 నాటికి ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌ ఐటీ రంగాన్ని శాసిస్తాయని..మిగతా రంగాల్లో ఉద్యోగాలు ఎక్కువగా ఉండకపోవచ్చని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐటీ ఉద్యోగాలు చేయాలనుకునేవారు..ఈ కొత్త టెక్నాలజీపై పట్టు సాధించడం తప్పనిసరంటున్నారు నిపుణులు. అంతేకాదు కొత్త నిపుణులను తయారుచేయగల సత్తా ఇండియాకు ఉందంటున్నారు. సైన్స్ అండ్‌ టెక్నాలజీ, మ్యాథ్స్‌, ఇంజనీరింగ్‌ విభాగాల్లో మనదేశంలో స్పెషలిస్టులు ఉన్నారని..డిమాండ్‌కు సప్లైకి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చేశక్తి మన ఐటీ ఇండస్ట్రీకి ఉందంటున్నారు. ఎడ్యుకేషన్ సంస్థలు కూడా ఈ విషయంలో శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని..ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీ, బిగ్‌డేటా అనలిటిక్స్‌ లాంటి కోర్సుల్లో కోచింగ్ తీసుకోవాలంటున్నారు. విద్యార్థులు ఈ దిశగా డెవలప్ అయితే  ఉద్యోగాలు సాధించటం ఈజీ అవుతుందని ఐటీ స్పెషలిస్టులు చెబుతున్నారు.