కవితలతో రూ.50లక్షలు గెలుచుకున్న హైదరాబాద్ అమ్మాయి

కవితలతో రూ.50లక్షలు గెలుచుకున్న హైదరాబాద్ అమ్మాయి

Updated On : December 10, 2019 / 5:03 AM IST

హైదరాబాద్ నుంచి శ్రాష్ట వాణి కొల్లి అనే టీనేజర్‌ రూ.50లక్షల బహుమతి గెలుచుకుంది. ఆస్ట్రేలియాలోని వాల్లంగాంగ్ యూనివర్సిటీ..   చేంజ్ ద వరల్డ్ అనే అంశంపై విన్నర్‌ను ప్రకటించింది. వాణీ కర్ణాటకలోని రేవా యూనివర్సిటీలో లా చదువుతుంది. తెలంగాణ సీనియర్ జర్నలిస్టు అరవింద్ కొల్లి కూతురైన ఈమె చిన్న వయస్సులోనే వైల్డ్ వింగ్స్ అనే పుస్తకాన్ని రచించింది. 

ఈ మేర స్కాలర్ షిప్ కోసం ప్రపంచవ్యాప్తంగా దరఖాస్తు చేసుకోగా ఎంపికైన ఇద్దరిలో వాణి ఒకరు. యూనివర్సిటీకి చెందిన అంతర్జాతీయ రిక్రూట్‌మెంట్ మేనేజర్ పీటర్ ముర్రే యువతికి అడ్మిషన్ లెటర్ అందజేశారు. విదేశీ విద్యను అందుకోలేకపోతున్న వారికి ప్రోత్సహకంగా స్కాలర్ షిప్ లు అందజేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. 

శ్రాష్ట తాను రాసిన పుస్తకమే ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందని సంతోషపడింది. యూనివర్సిటీ అధికారులు భావాలు తెలియజేసే విధానం చూస్తుంటే ఆశ్చర్యమేసిందట. దీనిని అందుకున్న ఏకైక భారతీయురాలు తానే కావడంతో గర్వదాయకం. ప్రొఫెషనల్ గైడెన్స్ ఇచ్చిన మేనేజింగ్ డైరక్టర్ షెల్లీ కర్నాటీ సహకారంతో ఇది సాధించగలిగినట్లు బాలిక పేర్కొంది.