ఫిభ్రవరి 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి.

  • Published By: veegamteam ,Published On : February 14, 2019 / 03:44 PM IST
ఫిభ్రవరి 22 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

Updated On : February 14, 2019 / 3:44 PM IST

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి.

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. ఫిభ్రవరి 22 నుంచి 25 వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. నాలుగు రోజులపాటు సమావేశాలు కొనసాగనున్నాయి. ఫిభ్రవరి 25 వ తేదీ వరకు సమావేశాలను నిర్వహించనున్నారు. ఈనెల 22వ తేదీ ఉదయం 11.30 గంటలకు సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. 23 వ తేదీన బడ్జెట్ పై చర్చ జరుగనుంది. 25 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలుపనుంది. అయితే అసెంబ్లీలో బడ్జెట్ ఎవరు ప్రవేశపెడుతారన్న అంశంపై ఉత్కంఠ నెలకొంది. బడ్జెట్ ను సీఎం ప్రవేశపెడుతారా లేదా ఆర్థిక మంత్రి ప్రవేశపెడతారా అన్న అంశం సందగ్ధింగా ఉంది.