తెలంగాణ బడ్జెట్ : లక్ష రుణమాఫీ కటాఫ్ తేదీ ప్రకటన

తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా సీఎం కేసీఆర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019-20 ఆర్థిక సంవత్సరాలకు గాను మొత్తం రూ.లక్షా 82 వేల కోట్ల బడ్జెట్‌ను కేసీఆర్ ప్రవేశపెట్టారు. ఇందులో వ్యవసాయానికి పెద్దపీట వేశారు. భారీగా నిధులు కేటాయించారు.
రైతుల పాలిట భారీగా వరాలు కురిపించారు. ఇందులో కీలకంగా రైతు బంధు కోసం రూ.12వేల కోట్లు కేటాయించగా, కేవలం రుణమాఫికి రూ.6వేల కోట్లను ప్రకటించారు. రైతుల భీమా పథకానికి రూ. 650కోట్లను ఇస్తూ భారీగా పంట నష్టాల నుంచి నిలదొక్కుకునేందుకు ఆసరా కల్పించారు.
రైతుల పాలిట మరో వరం రుణమాఫీ. ఒక్కో రైతుకు లక్ష రూపాయల వరకు మాఫీని చేస్తున్నట్లు వెల్లడించారు. కటాఫ్ను 2018 డిసెంబరు 11వ తేదీని నిర్ణయించారు. మొత్తంగా వ్యవసాయం రంగానికి రూ.20వేల 107 కోట్లు కేటాయించారు.
Read Also: నిరుద్యోగ భృతికి రూ.1,810 కోట్లు కేటాయింపు
Read Also: తెలంగాణ బడ్జెట్ : కళ్యాణ లక్ష్మి రూ.1,450 కోట్లు
Read Also: ఆరోగ్య తెలంగాణ : ENT, దంత పరీక్షల కోసం రూ.5వేల కోట్లు
Read Also: తెలంగాణ బడ్జెట్ : ఆసరా పెన్షన్స్ రూ.12 వేల 67 కోట్లు