బడ్జెట్ కి ఆమోదం : సంక్షేమానికి రూ.45వేల కోట్లు, వ్యవసాయానికి రూ.60వేల కోట్లు

తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. సోమవారం(సెప్టెంబర్ 9,2019) 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను

  • Published By: veegamteam ,Published On : September 9, 2019 / 05:41 AM IST
బడ్జెట్ కి ఆమోదం : సంక్షేమానికి రూ.45వేల కోట్లు, వ్యవసాయానికి రూ.60వేల కోట్లు

Updated On : September 9, 2019 / 5:41 AM IST

తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. సోమవారం(సెప్టెంబర్ 9,2019) 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్ పూర్తిస్థాయి బడ్జెట్‌ను

తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్‌ను చట్టసభల్లో ప్రవేశపెట్టనుంది. సోమవారం(సెప్టెంబర్ 9,2019) 11.30 గంటలకు అసెంబ్లీలో సీఎం కేసీఆర్, మండలిలో ఆర్థికమంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ను ప్రతిపాదిస్తారు. మార్చిలో 6 నెలల కాలానికి ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పరిమితి సెప్టెంబర్ నెలాఖరుతో ముగుస్తుంది. అక్టోబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు ప్రతిపాదించిన పూర్తి బడ్జెట్‌ను ఉభయసభలు ఆమోదిస్తాయి. బడ్జెట్ కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

భారీ అంచనాలకు ఆస్కారం లేకుండా… వాస్తవ లెక్కల ఆధారంగా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం.. తగ్గుతున్న కేంద్ర ప్రభుత్వ పన్నుల వాటా.. పతనమైన దేశ జీడీపీ వృద్ధిరేటు లాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని బడ్జెట్ ప్రతిపాదనలను తయారుచేశారు. ఆర్థిక సంవత్సరం ఆఖరునాటికి ఎదురయ్యే సానుకూల, ప్రతికూల ఆర్థిక పరిస్థితులను విశ్లేషించి… ప్రతి పైసకి లెక్కగట్టి పక్కా ప్రణాళికతో బడ్జెట్‌కు తుదిరూపమిచ్చారు.

ఆర్థిక వృద్ధిరేటుపై మాంద్యం ప్రభావం పడుతుండటం వల్ల… ఓట్‌ ఆన్ అకౌంట్ కంటే కొంతమేర అంచనాలను తగ్గించినట్టు తెలుస్తోంది. మార్చిలో లక్షా 82 వేల కోట్లతో ఓట్ ఆన్ అకౌంట్‌ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం.. ఈసారి లక్షా 65 వేల కోట్లకు కుదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌లో గతంలో మాదిరిగానే ఈసారి కూడా వ్యవసాయం, సాగునీరు.. సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమ రంగానికి రూ.45వేల కోట్లు.. వ్యవసాయం, సాగునీటికి రూ.60 వేల కోట్ల వరకు కేటాయించన్నట్లు సమాచారం.