దసరాకు తెలంగాణ మంత్రివర్గ విస్తరణ?

తెలంగాణ సీఎం కేసీఆర్ దసరాకు మంత్రివర్గ విస్తరణ చేపట్టబోతున్నట్టు తెలుస్తోంది. టీఆర్‌ఎస్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే సారి కేసీఆర్ మంత్రివర్గంలో కేటీఆర్, హరీశ్‌రావులకు బెర్త్ ఖాయమన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ మేరకు టీఆఎస్ వర్గాల్లో జోరుగా ప్రచారం కూడా సాగుతోంది. దీంతో కేబినెట్ బెర్త్‌లో కేటీఆర్, హరీశ్‌లను తీసుకోవచ్చనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొంత మందికి, ఓ మహిళకు కేబినెట్ బెర్త్ దక్కనున్నట్టు తెలుస్తోంది.
కేబినెట్ విస్తరిస్తే సీఎం కేసీఆర్..ఇంకా ఆరుగురిని తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లో చేరిన సబితా ఇంద్రారెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డికి కూడా కేబినెట్‌లో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో ఇద్దరిని తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. కేబినెట్‌లో నలుగురు కొత్తవారికి ఛాన్స్ ఇవ్వాలని ప్లాన్ వేసినట్లు సమాచారం. అయితే విస్తరణ తర్వాత వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే ఉత్కంఠ టీఆర్ఎస్ శ్రేణుల్లో నెలకొంది.
Read More : కిక్కు దిగుతుంది : తాగిన వారికి రూ. 10 వేలు..అమ్మితే లక్ష ఫైన్